హెరిటేజ్ ఫ్రెష్‌లో చోరీ

Mon,October 7, 2019 12:56 AM

ఖమ్మం రూరల్, నమస్తేతెలంగాణ: రూరల్ మండలంలోని హెరిటేజ్ ఫ్రెష్ సూపర్ మార్కెట్‌లో చోరీ జరిగిన సంఘటన చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. రూరల్ మండలం పెద్దతండాలో ప్రధాన రహదారి పక్కన హెరిటేజ్ ఫ్రెష్ సూపర్ మార్కెట్‌లో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి లాకర్‌లోని రూ. లక్ష నగదును తస్కరించారు. నగదుతో పాటు సీసీ టీవీ(డీపీఆర్) సిస్టమ్‌ను సైతం తస్కరించారు. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ సత్యనారాయణరెడ్డి బృందం సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్‌టీంను రప్పించి దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకట్రావ్ తెలిపారు.

216
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles