నకిలీ కానిస్టేబుల్ అరెస్ట్

Mon,October 7, 2019 12:56 AM

ముదిగొండ: పోలీస్‌కానిస్టేబుల్ అని చెప్పి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని ముదిగొండ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే ఈనెల 4న వల్లభి గ్రామంలో కిరాణ షాపుకు వెళ్లి నిషేధిత గుట్కాలు అమ్ముతున్నారని తమకు సమాచారం ఉన్నది. మిమ్మల్ని అరెస్టు చేసి పోలీస్‌స్టేషనకు తీసుకెళ్లాలని భయపెట్టాడు. రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా, రూ. 1000 ఇచ్చాడు. తరువాత మరో షాపుకు వెళ్లి బెదిరించగా, గ్రామస్తులకు అనుమానం వచ్చి నిలదీయగా, ద్విచక్రవాహనంపై పరారయ్యాడు. ఆ షాప్ యజమానులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేయగా, దర్యాప్తు చేపట్టారు. కాగా ఎస్‌ఐ మహేశ్ ఆధ్వర్యంలో న్యూలక్ష్మీపురం వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు చట్టు నాగరాజు నేకొండపల్లి మండలం నాచేపల్లి గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. ద్విచక్రవాహనం సీజ్ చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలిచినట్లు ఎస్ మహేశ్ తెలిపారు.

235
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles