ఉపాధ్యాయుడిపై వరకట్న వేధింపుల కేసు నమోదు

Mon,October 7, 2019 12:57 AM

కూసుమంచి: ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై కూసుమంచి పోలీస్‌స్టేషన్‌లో వరకట్న వేధింపుల కేసు నమోదైంది. ఎస్‌ఐ అశోక్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కూసుమంచికి చెందిన బెల్లంకొండ శ్రీనివాస్ పెద్దకూతురు చంద్రకళకు 2011లో బోదులబండకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు చింతలపాటి శ్రీనివాస్‌తో వివాహం జరిగింది. కొంతకాలం వీరి కాపురం సజావుగా సాగింది. వీరికి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. శ్రీనివాస్ భార్యాపిల్లలతో ఖమ్మం నివాసం ఉంటూ, కోయచెలక పాఠశాలలో పనిచేస్తున్నాడు. కొంతకాలంగా అదనపు కట్నం కోసం భార్య చంద్రకళను వేధిస్తున్నాడు. దీంతో చంద్రకళ పిల్లలతో కూసుమంచిలోని తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. తండ్రి బెల్లకొండ శ్రీనివాస్ సహకారంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

269
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles