డిపోల వద్ద పటిష్ట బందోబస్తు అడిషనల్ డీసీపీ దాసరి మురళీధర్

Tue,October 8, 2019 12:43 AM

ఖమ్మం క్రైం : ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మెలో భాగంగా మూడవ రోజు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అడిషనల్ డీసీపీ దాసరి మురళీధర్ పర్యవేక్షణలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం నగరంలోని ఖమ్మం డిపోలో ఆర్టీసీ సమ్మె పరిస్థితిని పరిశీలించేందుకు డిపోను సందర్శించారు. విధులకు హాజరయ్యే తాత్కాలిక డ్రైవర్ల, కండక్టర్ల వ్యక్తులపై, ఆర్టీసీ బస్సులను ఎవరూ అడ్డుకోకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యల గురించి పోలీసు అధికారులకు వివరించారు. పోలీస్ ఉన్నతాధికారుల సూచనల మేరకు జిల్లాలో ఎలాంటి హింసాత్మక చర్యలకు తావు లేకుండా ప్రయాణీకులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు డీసీపీ తెలిపారు. అనంతరం అక్కడ బందోబస్తు పర్యవేక్షిస్తున్న టౌన్ ఏసీపీ వెంకట్రావు, ఏఆర్ ఏసీపీ విజయ్‌బాబు, సీఐ అంజలికి బందోబస్తుపై పలు సూచనలు చేశారు. అక్కడ ఉన్న అర్బన్ ఎంఆర్‌వోతో మాట్లాడారు. సమ్మె యొక్క పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. బస్సులను ఎట్టి పరిస్థితుల్లో అప్ప కూడదని పోలీసుల సహాయంతో బస్సులను బయటికి తీసేందుకు చర్యలు తీసుకోవాలని డీఎంకు సూచించారు.

203
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles