ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు చేర్చాలి

Sat,October 12, 2019 11:48 PM

ఖమ్మం, నమస్తే తెలంగాణ:ప్రభుత్వ పథకాల లబ్ధిని అర్హులైన ప్రతీ ఒక్కరికి అందించాలని జాతీయ మహిళా కమిషన్‌ స భ్యురాలు శ్యామల ఎస్‌ కుందన్‌ అన్నారు శనివారం ఖమ్మం పర్య టన సందర్భంగా కలెక్టరేట్‌ ప్రజ్ఞాసమావేశ మందిరంలో జేసీ అనురాగ్‌ జయంతితో కలిసి స్త్రీశిశు సంక్షేమ, విద్య, వైద్య, కార్మిక, గ్రామీణాభివృద్ధి,ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల ద్వారా జిల్లాలో మహిళా సంక్షేమానికి అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాల పురోగతిని మహిళా కమిషన్‌ సభ్యులు సమీక్షించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభు త్వ పథకాలు గ్రామస్థాయి నుంచి అమలైతేనే మంచి ఫలితాలు వస్తాయన్నారు. మహిళల కొరకు ప్రత్యేక చట్టాలున్నాయని, వాటిని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అవగాహన కల్పించి మహిళా చట్టాలను వినియోగించుకునే విధంగా అధికారులు పనిచేయాలని ఆమె సూచించారు. ప్రధాన మంత్రి యోజనలన్నీ కేంద్రం నుంచి రాష్ర్టానికి, రాష్ట్రం నుంచి జిల్లాకు, జిల్లా నుంచి మండల,గ్రామస్థాయి ప్రజల వరకు చేర్చి వాటి అమలు పురోగతి జాతీయ మహిళా కమిషన్‌ జిల్లాలో పర్య టించి సమీక్షలు నిర్వహిస్తుందన్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలన్ని లబ్ది ప్రజలందరికీ చేకూర్చి ప్రధాన మంత్రి కలలను సాకారం చేయాలని అధికారులను ఆమె సూచించారు. ప్రధానంగా “బేటీబచావో బేటీ పడావో”కార్యక్రమాన్ని జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రులలో ఆడ పిల్లలకు జన్మనిచ్చిన ప్రతి తల్లికి దీనిపై అవగాహన కల్పించాలని వైద్య శాఖ అధికారులకు, స్త్రీశిశు సంక్షేమ శాఖ అధికారులను కమిషన్‌ సభ్యులు సూచించారు. వివిధ కర్మాగారాలలో, ఫ్యాక్టరీలలో, భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న మహిళా కార్మికులకు ప్రవేశపెట్టబడిన పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేసి లబ్ధి చేకూర్చాలన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సింగిల్‌ యూజ్‌ప్లాస్టిక్‌ను నిషేధించినందున స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులతో క్లాత్‌, పేపర్‌ బ్యాగుల తయారీకి తగు చర్యలు తీసుకోవాలని తద్వారా ఉపాధి అవకాశాలలో మోడల్‌ వృత్తి నైపుణ్యత పెంపొందుతుందని గ్రామీణాభివృద్ధి అధికారిని కమిషన్‌ సభ్యులు సూచించారు.

జేసీ అనురాగ్‌ జయంతి మాట్లాడుతూ మహిళా సంక్షేమానికి పనిచేస్తున్న అనుబంధ శాఖలన్నింటినీ జిల్లా స్థాయిలో సమన్వయపర్చి కేంద్ర ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతీ ఒక్కరికి అందించేందుకు మరింత సమర్థ్దవంతంగా పట్టుదలతో కృషితో కలెక్టర్‌ ఆదేశాల మేరకు పనిచేస్తామని తెలిపారు. జిల్లాలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని కూడా నెల రోజుల్లో పూర్తిస్థాయిలో అమలు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. మహిళా సంక్షేమంలో భాగంగా జిల్లాలో అమలవు తున్న కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం పథకాల అమలు పురోగతిని అనుబంధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా జాతీయ మహిళా కమిషన్‌ సభ్యులకు వివరించారు. జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న సఖీ కేంద్రం ద్వారా జిల్లాలోని అన్ని మండలాల్లో అవగాహన కార్యక్రమా లను నిర్వహించడంతో పాటు 151 మందిని తాత్కాలిక షెల్టర్లలో చేర్పించడంతో పాటు 131 కేసులను పోలీసు శాఖ సహకారంతో పరిష్కరించడం జరిగిందని ఆయన తెలిపారు. పోషన్‌ అభియాన్‌లో భాగంగా జిల్లాలో సెప్టెంబర్‌ మాసంలో పోషన్‌ మాసం కార్యక్రమాన్ని నిర్వహించి మహిళలు, కౌమార దశలోని బాలికలపై వైద్య పరీక్షలు నిర్వహించి, రక్తహీనత ఉన్న వారికి అవసరమైన వైద్య సేవలందించామని, దీనితో పాటు సామూహిక సీమంతాలు, అన్న ప్రాసన కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని వివరించారు. మహిళా కార్మికుల సంక్షేమంలో భాగంగా జిల్లాలో 30 వేల మంది మహిళా కార్మికులకు 3 కోట్ల 11 లక్షల రూపాయలను ప్రసూతి పథకం కింద, 2019 జనవరి నుంచి 361 మంది మహిళా కార్మికులకు కోటి 7 లక్షల రూపాయలను వివాహ బహుమతి పథకం కింద అందించడం జరిగిందన్నారు.

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు బ్యాం క్‌ లింకేజీ, స్త్రీనిధి పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించి వారిని అర్థికంగా బలోపేతం చేస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ వివరించారు. బాలికా విద్యాభివృద్ధిలో భాగంగా జిల్లాలోని 14 కస్తూరిబా గాంధీ విద్యాలయాలలోని బాలికలకు వసతితో కూడిన విద్యనందించడంతో పాటు 22 వేల మంది విద్యార్థి నీలకు హెల్త్‌ కిట్స్‌ అందించడం జరిగిందన్నారు. వైద్యపరంగా కేంద్ర ప్రభుత్వ పథకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కేసీఆర్‌ కిట్స్‌, నగదు ప్రోత్సాహకం అందిస్తున్నామన్నారు. దీనితో పాటు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ పథకాల కింద పేదింటి ఆడపిల్ల వివాహం కొరకు లక్షా ఒక వేయి నూట పద హారు రూపాయలను అందిస్తున్నామన్నారు. కల్యాణలక్ష్మీ క్రింద 2018-19 సంవత్సరంలో 3 వేల 99 మందికి, షాదీముబారక్‌ కింద 368 మందికి అందించడం జరిగిం దన్నారు. దీనితో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ప్రీ, పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌షిప్స్‌ అందించడం జరుగుతుందని జాయింట్‌ కలెక్టర్‌ వివరించారు. శిక్షణ కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, జిల్లా రెవెన్యూ అధికారి సబిత, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్‌ కళావతిబాయి, జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బీ వెంకటేశ్వర్లు, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి బీ ఇందుమతి, జిల్లా బాలల సంరక్షణ అధికారి విష్ణువందన, పోషణ్‌ అభియాన్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ ప్రభావతి, డీఈవో మదన్‌మోహన్‌, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు సత్యనారాయణ, హృషికేష్‌రెడ్డి, మహిళా పోలీస్‌స్టేషన్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ అంజలి, కార్మిక, సంబంధిత శాఖల అధికారులు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

179
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles