పనులను వేగవంతంగా నిర్వహించేలా చర్యలు

Thu,October 17, 2019 12:58 AM

మణుగూరు, నమస్తే తెలంగాణ: అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం మణుగూరు-పినపాక మండలాల్లో నిర్మిస్తున్న 1080(4X270)మెగావాట్ల సామర్థ్యం కలిగిన భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను జెన్కో డైరెక్టర్(ప్రాజెక్టు) ఎం. సచ్చితానందం, డైరెక్టర్(సివిల్) అజయ్ బుధవారం పరిశీలించారు. తొలుత ప్లాంటులో కలియతిరుగుతూ నిర్మాణ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ యూనిట్-1లో సింకర్నైజేషన్ విజయవంతంగా నిర్వహించామని, వచ్చేనెలలో సీవోడీ చేస్తామన్నారు. ఈ నెల 20కల్లా యూనిట్-2లో లైటప్ చేసేందుకు నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. నవంబర్‌లో యూనిట్-3లో లైటప్, యూనిట్-4లో హైడ్రాలిక్ టెస్టు చేసేందుకు పనులను పూర్తి చేస్తున్నామన్నారు.

మణుగూరు ఏరియా నుంచి బీటీపీఎస్‌కు వచ్చే నెలలోనే రోడ్డుమార్గం ద్వారా కోల్‌ట్రాన్స్‌పోర్టు చేసుకుంటామన్నారు. ఇప్పటికే మణుగూరు ఏరియా పీకేవోసీ-4, మణుగూరు ఓసీ(మల్లేపల్లి) నుంచి రోడ్డుమార్గం ద్వారా కోల్ ట్రాన్స్‌పోర్టుకు ఎంఈవోఎఫ్ అనుమతులు వచ్చాయన్నారు. వచ్చే నెల యూనిట్-3లో లైటప్ చేసేందకు, యూనిట్-4లో హైడ్రాలిక్ టెస్ట్ కోసం పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. అన్ని పనులు షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసి అన్నియూనిట్స్‌ను కూడా ఈ ఏడాది చివరి కల్లా సింకర్నైజేషన్ చేసి, విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. బీటీపీఎస్ సీఈ పిల్లి బాలరాజు, జోన్కో, భేల్ అధికారులు ఆయనతో పాల్గొన్నారు.

176
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles