కూలింగ్ గ్యాస్ ట్యాంకర్ బోల్తా

Thu,October 17, 2019 12:59 AM

ఖమ్మం రూరల్, నమస్తేతెలంగాణ: కూలింగ్ గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడిన సంఘటన మండలంలో చోటుచేసుకున్నది. స్థానికుల వివరాల ప్రకారం.. కర్నూల్ నుంచి సింగరేణికి ప్రేం కంపెనీ కూలింగ్ గ్యాస్ లారీ డ్రైవర్ బాణోత్ రెడ్డి స్వగ్రామం రూరల్ మండలం తీర్థాల కావడంతో మంగళవారం రాత్రి పడుకునేందుకు ఇంటికి వచ్చాడు. బుధవారం ఉదయం డోర్నకల్ మీదుగా సింగరేణి వెళ్తుండగా, గ్రామశివారులో లారీ అదుపు తప్పి మిరపతోటలో పడింది. లారీలో ఉన్న కూలింగ్ గ్యాస్ మొత్తం పరిసర ప్రాంతాలను ఆవరించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి వచ్చి విచారణ చేపట్టారు.

224
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles