ముగిసిన మద్యం టెండర్ల ప్రక్రియ

Thu,October 17, 2019 01:01 AM

-చివరి రోజున పోటెత్తిన దరఖాస్తుదారులు
-అర్ధరాత్రి వరకు దరఖాస్తుల స్వీకరణ
-89 దుకాణాలకు 4029 దరఖాస్తులు
-ఎక్సైజ్ శాఖకు రూ. 80.58 కోట్ల ఆదాయం
-చివరి రోజు ఆంధ్ర వ్యాపారుల హవా..
-18న లాటరీ ద్వారా షాపుల కేటాయింపు

ఖమ్మం క్రైం: ఆఖరు రోజు మద్యం టెండర్ల ప్రక్రియ జిల్లాలో జాతరను తలపించింది. జిల్లావ్యాప్తంగా ఉన్న దుకాణాలను దక్కించుకునేందుకు వ్యాపారులు టెండర్ల ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పోటీ పడ్డారు. ఈ నెల 9న దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది, మొదటి రెండ్రోజులు మందకొడిగా సాగింది. మూడవ రోజు నుంచి ఊపందుకుంది. చివరి రోజైన బుధవారం మద్యం వ్యాపారులు దరఖాస్తులు సమర్పించేందుకు పోటెత్తారు. టెండర్లలో తలపండిన వారు ఎత్తులు పైఎత్తులు వేశారు. చివరి రోజు కొంత బినామీల హవా కూడా కన్పించింది. ఖమ్మం జిల్లాలోని 89 మద్యం దుకాణాలకు బుధవారం రాత్రి పొద్దుపోయే వరకు 4,029 దరఖాస్తులు అందాయి. వీటి ద్వారా జిల్లా ఎక్సైజ్ శాఖకు రూ.80.58 కోట్ల ఆదాయం వచ్చినైట్లెంది. చివరి రోజు దరఖాస్తులను దృష్టిలో ఉంచుకుని మద్యం వ్యాపారంలో ఆరితేరిన పలువురు రంగ ప్రవేశం చేశారు. గతంలో వీరు పలు దుకాణాలను దక్కించుకోవడంతో పాటు తమకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు. కొందరు స్వయంగా, మరికొందరు తమ కుటుంబీకులు, బంధువుల పేర్లతో దరఖాస్తు చేశారు.

ఖమ్మం కార్పొరేషన్‌లోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్-1 పరిధిలోని 21 షాపులకు 650, ఖమ్మం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్-2 పరిధిలోని 14 షాపులకు 548 దరఖాస్తులు అందాయి. నేలకొండపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 11 షాపులకు 725, వైరా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 9 షాపులకు 556, మధిర ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 12 షాపులకు 682, సత్తుపల్లి ఎక్సైజ్ పోలీస స్టేషన్ పరిధిలోని 15 షాపులకు 756, సింగరేణి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 7 షాపులకు 346 దరఖాస్తులు అందాయి. సాయంత్రం 4.00 గంటల వరకు క్యూలో వేచి ఉన్నవారికి ఎక్సైజ్ అధికారులు టోకెన్లు ఇచ్చారు. ఆ టోకెన్ నెంబర్ల ఆధారంగా వారిని లోపలికి పిలిచి దరఖాస్తు స్వీకరించారు. ఈసారి మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు మహిళలు కూడా అధిక సంఖ్యలో టెండర్లు దాఖలు చేశారు. ఈ నెల 18న ఖమ్మం సీక్వెల్ రిసార్ట్స్‌లో మద్యం దుకాణాలకు లాటరీ ప్రక్రియను కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్, పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ నిర్వహిస్తారు.

చివరి రోజు ఆంధ్ర వ్యాపారుల హవా..
మద్యం టెండర్లకు బుధవారం చివరి రోజు కావడంతో హోటళ్లు, లాడ్జీలన్నీ మద్యం వ్యాపారులు, వారి బినామీలతో నిండిపోయాయి. టెండర్లు దాఖలు చేసే ఎక్సైజ్ కార్యాలయం, ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో ఎటు చూసినా భారీ ఎత్తున వాహనాలు రోడ్లకిరువైపుల నిలిపోయాయి. మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు ఎక్కువ ఆదాయం వచ్చే దుకాణాలకు వందల సంఖ్యలో కొందరు వ్యాపారులు స్వయంగా దరఖాస్తు చేయడంతోపాటు తమ అనుచరులు, బందుగణంతో కూడా చేయించారు. ఎక్కవగా ఆంధ్రరాష్ట్రంలోని తూన్పేగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి వ్యాపారులు వచ్చారు. వీరు మూడు రోజుల పాటు ఖమ్మం లాడ్జీలలో దిగారు. స్థానిక మద్యం వ్యాపారులతో మిలాఖాతచి కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టారు.

ఈసారి కూడా మొదటి స్థానంలో ఖమ్మం
జిల్లావ్యాప్తంగా చివరి రోజు అర్థరాత్రి వరకు మద్యం షాపులకు దరఖాస్తులు ప్రక్రియ కొనసాగింది. ఒక్కో షాపుకు రూ. 2లక్షల దరఖాస్తు ఫీజు లెక్కిస్తే రూ.80.58 కోట్ల ఆదాయ వచ్చినైట్లెంది. ఖమ్మం యూనిట్ పరిధిలోని చింతకాని, ఏదులాపురం, నాగులవంచ దుకాణాలకు ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. జిల్లాలోని మొదటి స్థానంలో సత్తుపల్లిలో ఉన్న షావులకు 756 దరఖాస్తులు వచ్చాయి. రెండో స్థానంలో నేలకొండపల్లి, మూడోస్థానంలో మధిర ఉన్నాయి. 2017-2019 సంవత్సరంలో 83 షావులకు 4029 దరఖాస్తులు వచ్చాయి. దీంతో ఖమ్మం జిల్లా ఫస్ట్‌లో నిలిచింది. ఈ సారి కూడా ఖమ్మం జిల్లా మొదటి స్థానంలో ఉన్నదని అధికారులు చెబుతున్నారు. గతంలో మద్యం దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు మళ్లీ దుకాణాలు దక్కించుకునేందుకు భారీగానే టెండర్లు వేశారు.

288
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles