ఘనంగా రాముడి నిత్యకల్యాణం

Thu,October 17, 2019 11:47 PM

భద్రాచలం, నమస్తే తెలంగాణ:భద్రాచలం రామాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారు జామున అర్చకులు ఆలయ తలుపులు తెరిచి ముం దుగా స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. గోదావరి నది నుంచి తీర్థబిందెను తీసుకొచ్చి అభిషేకం చేశారు. ఆరాధన, అర్చన, సేవాకాలం, పుణ్యఃవచనం, నివేదన తదితర పూజలు గావించారు. వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలం వచ్చిన భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. రామాలయానికి చేరుకొని రామున్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు ఆలయంలోని బేడా మండపంలో రామునికి ఘనం గా నిత్యకల్యాణం నిర్వహించారు.

213
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles