రైతులకు అండగా తెలంగాణ ప్రభుత్వం..

Thu,October 17, 2019 11:47 PM

సారపాక: తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం సారపాక ఐటీసీ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుసంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని, రైతును రాజు చేయాలనేది కేసీఆర్ లక్ష్యమన్నారు. ప్రభుత్వం ఇప్పటికే రైతులకు రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపె ట్టిందని, వాటితో పాటు పైలెట్ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలోని రైతులకు ఎకరాకు రూ.9వేలు అదనంగా సహాయం అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నా యని, ప్రతి రైతుకు పైలెట్ ప్రాజెక్టు ద్వారా పెట్టుబడి సాయంతో పాటు అదనంగా ఎకరాకు రూ.9వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం చూస్తుందన్నారు. ఈ మేరకు నూతన వ్యవసాయ విధానంపై రైతులకు అవగాహన కల్పించడం జరుగు తుందని మంత్రి స్పష్టం చేశారు. రైతులు మరింత అభివృద్ధి చెందేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలూ రైతుల బాగుకోసం కృషిచేస్తున్నారన్నారు. నూతన పద్ధ తులు అవలంభించే విధంగా రైతులకు జిల్లా యంత్రాంగం ద్వారా అవగాహన కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.

ఆర్టీసీ సమ్మెను ఆసరా చేసుకుని ప్రతిపక్షాలు కార్మికులను రెచ్చగొడుతున్నాయి రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మెను ఆసరా చేసుకుని ప్రతిపక్షాలు, నాయకులు కార్మికులను రెచ్చగొడుతున్నాయని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆర్టీసీ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నా నాయకులు మాత్రం ప్రభుత్వాన్ని చాలెంజ్ చేస్తున్నారని, కార్మికుల పక్షాన న్యాయం జరగాలని కోరుకునే వారిలో తాను కూడా ఉన్నానని మంత్రి తెలిపారు. ఆర్టీసీని ఎట్టిపరిస్థితుల్లో ప్రభుత్వంలో విలీనం చేయడం జరగదని, ఇప్పటికే ఆర్టీసీలో 50వేల మంది ఉద్యోగాలను ప్రభుత్వంలో తీసుకుంటే రాబోయే రోజుల్లో యువతకు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉండవన్నారు. ఆర్టీసీ కార్మికులను రెచ్చగొట్టిన పార్టీలకు ఇతర రాష్ర్టాల్లో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేశారా...సమాధానం చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. వీలైనంత త్వరగా ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభు త్వం సానుకూలంగా ఉందని మంత్రి తెలిపారు. ఈ విలేకరుల సమా వేశంలో భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, భద్రాద్రి జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ, సబ్‌కలెక్టర్ భవేష్‌మిశ్రాలతో పాటు వ్యవసాయశాఖకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

248
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles