ప్లాస్టిక్ నిషేధంలో తల్లాడ మండలం ముందుండాలి

Fri,October 18, 2019 11:11 PM

తల్లాడ, అక్టోబర్ 18 : పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ రహిత జిల్లాగా ఖమ్మాన్ని తీర్చిదిద్దాలని నిర్ణయించిన దృష్ట్యా జిల్లాలో తల్లాడ మండలాన్ని ముందంజలో ఉంచేలా ప్రతిఒక్కరూ కృషిచేయాలని ట్రైనీకలెక్టర్ ఆదర్శ్‌సురభి కోరారు. శుక్రవారం తల్లాడలో ప్లాస్టిక్ నిర్మూళన అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఉద్ధేశించి ఆదర్శ్‌సురభి మాట్లాడుతూ ప్లాస్టిక్ వల్ల పర్యావరణం కలుషితమై క్యాన్సర్ వంటి వ్యాధులు ప్రభలే ప్రమాదం ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి వాడిపడేసే ప్లాస్టిక్‌ను నిషేధించడం జరిగిందని వివరించారు.

ప్లాస్టిక్ నిర్మూళన పట్ల ప్రజలను చైతన్యవంతులను చేయాలని ప్లాస్టిక్ నిర్మూళనకు కృషిచేస్తున్న సామాజిక కార్యకర్త కొత్తూరు ఫణిని ఆయన అభినందించారు. బాలభారతి విద్యార్థులు ప్లాస్టిక్ నిర్మూళన నినాదాలతో ఫ్లకార్డులతో ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రదర్శనలో ఆవుకు ప్లాస్టిక్ నిర్మూళన నినాదాలతో బ్యానర్ కట్టి ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ కొట్టేటి సంధ్యారాణి, కేఎస్‌ఎం విద్యాసంస్థల కరస్పాండెంట్ కోటగిరి ప్రవీణ్, ప్రిన్సిపాల్ తాల్లూరి రామారావు, లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు మిట్టపల్లి నరసింహారావు, దాసరి శ్రీనివాసరావు, ఇస్నేపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

219
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles