22న తాత్కాలిక అధ్యాపకుల నియామకాలకు ఇంటర్వ్యూలు

Sun,October 20, 2019 03:57 AM

భద్రాచలం, నమస్తే తెలంగాణ అక్టోబర్ 19: భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో గల గిరి జన సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలలో గల బాలురు, బాలికలకు తాత్కాలిక ప్రాతిపదికన ఉపాధ్యాయ,అధ్యాపకులుగా నియామకాల కొరకు ఈనెల 22వ తేదీ స్థానిక గిరిజన గురరుకుల పాఠశాల (బాలికలు) భద్రాచలంలో ఇంట ర్వ్యూలు నిర్వహించనున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీవో వీపీ గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఖాళీల వివరాలు టీజీటీ ఏజెన్సీ ప్రాంత గిరిజన మహిళలకు తెలుగు-01, ఇంగ్లిష్ 02, జనరల్ ఎస్టీ గణితం 01, పీజీటీ ఏజెన్సీ ప్రాంత గిరిజన మహిళలకు మ్యాథ్స్ 02, భౌతికశాస్త్రం 01, జేఎల్స్ గిరిజన మహిళలకు ఇంగ్లీష్ 01, ఫిజిక్స్ 01, కెమిస్ట్రీ 01, హిస్టరీ 01, కామర్స్ 01, జనరల్ ఎస్టీ స్త్రీ/పురుషు ఫిజిక్స్ 02 కలవని పీవో పేర్కొన్నారు. కావునా ఆయా సబ్జెక్టులలో 50 శాతం బీఈడీలో, టెట్‌లో 50శాతం అర్హత కలిగి, ఆసక్తి గల ఎస్టీ అభ్యర్థులు మాత్రమే తమ విద్యార్హతల ఒర్జినల్ సర్టిఫికెట్స్, అనుభవానికి సంబంధించిన సర్టిఫికెట్స్‌తో పాటు డెమోకు హాజరు కావాలని కోరారు. ఇంగ్ల్లిష్ మీడియం అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే ఆంగ్ల బోధనలోని డెమో ఉంటుందని, ఇంగ్లిష్ భాషపై పట్టు గల అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేయనున్నట్లు పీవో గౌతమ్ పేర్కొన్నారు.

250
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles