రైతుల ఖాతాల్లో పంటపెట్టుబడి..

Sun,October 20, 2019 03:58 AM

ఖమ్మం వ్యవసాయం : తెలంగాణ సర్కార్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం జిల్లాలో గత వారం రోజుల నుంచి మిగిలిన రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. ఖరీప్ సీజన్ ప్రారంభంలోనే జిల్లావ్యాప్తంగా రైతులకు పంటల పెట్టుబడి సొమ్ము వారి ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేసింది. కొన్ని సాంకేతిక కారణాల వలన దాదాపు 40శాతం మంది రైతులకు అందలేదు. దీంతో సదరు రైతులకు సైతం ప్రభుత్వం రైతుబంధు సొమ్మును తిరిగి గత వారం రోజుల నుంచి జమ చేస్తున్నారు. గత సంవత్సరం వానాకాలం, యాసంగి సీజన్‌లలో కలిపి ఎకరానికి రూ.4వేలు చొప్పున పంటల పెట్టుబడి అందించి ప్రభుత్వం. గత ఏడాది వానాకాలం సీజన్‌లో 2.85 లక్షల మంది రైతులకు గాను రూ.275.03 కోట్లు అందించారు. యాసాంగి సీజన్‌లో 2.74 లక్షల మంది రైతులకు గాను రూ.270.84 కోట్లు అందించారు. ఇక పోతే ఈ సంవత్సరం ఖరీఫ్‌కు సంబంధించి నేటి వరకు 2.81 లక్షల మంది రైతులకు గాను రూ.226.55 కోట్లు జమ చేశారు. ఈ సంవత్సరం ఖరీఫ్‌లో రూ.345.49 కోట్లు పంటల పెట్టుబడిగా ప్రభుత్వం రైతులకు అందివ్వాలని నిర్ణయం తీసుకుంది. మరికొద్ది రోజుల్లోనే మిగిలిన రైతులకు వారి అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

రైతన్నల కోరిక మేరకు..
గత సంవత్సరం వానాకాలం, యాసాంగి సీజన్‌లకు సంబంధించి ఎకరానికి రూ.8వేల చొప్పున అందించింది ప్రభుత్వం. రైతుల కోరిక మేరకు, పెరిగిపోతున్న పంటల పెట్టుబడిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని పెంచింది. ఈ సంవత్సరం రెండు సీజన్‌లకు కలిపి ఎకరానికి రూ.10 వేల చొప్పున అందింస్తుంది. గత కొద్ది రోజుల నుంచి రైతుల అకౌంట్లో ఎకరానికి రూ.5వేల చొప్పున పంటల పెట్టుబడి జమ చేశారు. ఈ నెల చివరి నాటికి ఖరీఫ్‌కు సంబంధించిన పంటల పెట్టుబడి సొమ్మును అర్హత కలిగిన ప్రతీ రైతుకు అందించేందుకు గాను ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. మరికొద్ది రోజుల్లో యాసాంగి సీజన్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ప్రక్రియ వేగవంతం చేశారు. దీంతో వచ్చే నెల చివరిలో కాని, నవంబర్ నెల మొదటి వారంలో యాసాంగి పెట్టుబడి సాయం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

రైతుబంధుతో పెరిగిన సాగు..
తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం సాగు విస్తీర్ణం పెంపుపై ప్రభావం చూపుతుంది. గత సంవత్సరం జిల్లాలో సాగైన విస్తీర్ణం గణాకాలు పరిశీలిస్తే అర్థం అవుతుంది. గత సంవత్సరం వానాకాలం సీజన్లో జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 2.30 లక్షల హెక్టార్లు కాగా, ఈ ఏడాది దాదాపు 2.35 లక్షల హెక్టార్లలో రైతులు సాగు చేశారు. ఒక వైపు సాగునీటి ప్రాజెక్టులు అందుబాటులోకి రావడం, సాగర్ కాలువ ద్వారా నీటి విడుదల కావడంతో రైతులు నూతన ఉత్సాహంతో సాగు చేస్తున్నారు. ప్రభుత్వమే స్వయంగా పంట పెట్టుబడి అందిస్తుడంటంతో గతంలో భూమిని కౌలుకు ఇచ్చిన రైతులు సైతం స్వయంగా సాగు చేసుకోవడం విశేషం. అదే విధంగా వ్యవసాయాన్ని వదులుకొని పట్టణాలకు, నగరాలకు వలస వెళ్లిన వేలాది మంది రైతులు తిరిగి తమ పల్లెలకు చేరుకొని పంటు పండిస్తున్నారు. రైతుల ఇబ్బందులను పరిగణంలోకి తీసుకొని టీ సర్కార్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం నేడు యావత్ దేశ రైతాంగానికి సైతం మేలు చేకూర్చింది. టీ సర్కార్ బాటలోనే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన పథకం ప్రవేశపెట్టిన సంగతి విధితమే. అదే విధంగా ఆయా పేర్లతో ఆంధ్రప్రదేశ్, పశ్చిబెంగల్, ఇతర అనేక రాష్టలు సైతం ఇదే ఒరవడి దిశగా చర్యలు చేపట్టాయి.

300
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles