సంపూర్ణంగా ప్రజా రవాణా

Mon,October 21, 2019 01:11 AM

-జిల్లాలో కనిపించని ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం
-90శాతం నడిచిన బస్సులు
-సాఫీగా ప్రజారవాణా..
-నిరంతరం అధికారుల పర్యవేక్షణ
-నేటి నుంచి పాఠశాలల పునః ప్రారంభం నేపథ్యంలో పెరిగిన రద్దీ

కొత్తగూడెం అర్బన్, అక్టోబర్ 20: ఆర్టీసీ జాక్ నాయకులు సమ్మె చేస్తున్నప్పటికీ ప్రయాణీకులు తాము చేరాల్సిన గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకుంటున్నారు. ఆదివారం సెలవు రోజైనప్పటికీ ఎక్కడా ఇబ్బందులు లేకుండా సాఫీగా ప్రయాణం జరిగేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు అన్నీ ఏర్పా ట్లు చేయడంతో సమస్యలు లేకుండా సాగింది. ఆదివారం మూడు బస్టాండ్‌లలో ప్రయాణీకుల ర ద్దీ పెరిగిందని అధికారులు పేర్కొన్నారు. శనివారం, ఆదివారం సెలవురోజులకు వివిధ ప్రాంతాల నుంచి స్వస్థలాలకు వచ్చిన ప్రైవేట్ ఉద్యోగులు, ఇతర సంస్థలలో పనిచేసే ఉద్యోగులు, విద్యార్థులు, వారి కుటుంబసభ్యులతో తిరుగుముఖం పట్టడంతో ఆర్టీసీ ప్రాంగణాలు నిండిపోయాయి. ఆర్టీసీ జాక్ నాయకులు చేస్తున్న సమ్మె 16వ రోజుకు చేరుకుంది. అయినప్పటికీ ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రయాణీకులకు ఇబ్బందులు లేకుండా బస్సులను నడుపుతుండటంతో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి.

బస్సుల్లో పెరిగిన ప్రయాణికులు
సోమవారం నుంచి పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో దసరా సెలవులకు తమ స్వస్థలాలకు వచ్చి న విద్యార్థులు వారు విద్యనభ్యసించే ప్రాంతాలకు వెళ్ళేందుకు ఆదివారమే బస్టాండ్‌కు చేరుకున్నారు. దీంతో కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు బ స్టాండ్ ప్రాంగణాలు విద్యార్థులు, వారి తల్లిదండ్రు లు, బంధువులతో నిండిపోయాయి. శనివారం బంద్ నిర్వహించడంతో ఆదివారం బస్సులు నడుస్తాయో లేదోనని అనుమానంతో బస్టాండ్‌కు వచ్చి న ప్రయాణీకులకు ఆర్టీసీ అధికారులు బస్సులు యధావిధిగా నడుపుతున్నారని తెలియడంతో సం తోషపడ్డారు. జిల్లాలోని మూడు డిపోల నుంచి వివిధ ప్రాంతాలకు బస్సులను నడిపారు. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌లే కాకుండా డీలక్స్, సూపర్ లక్సరీ బస్సులు, రాజధాని ఏసీ బస్సులను సైతం నడిపారు. భద్రాచలం, ఇల్లెందు, మణుగూరు, ఖ మ్మం, హైదరాబాద్, మిర్యాలగూడ, విజయవాడ, వరంగల్, హన్మకొండ తదితర ప్రాంతాలకు బస్సు లు తిరిగాయి.

కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ ఆదేశాల తో మేరకు కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం డిపోలకు ప్రత్యేక నోడల్ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు బస్సుల రూట్లను పర్యవేక్షిస్తూ డ్రైవర్లకు, కండక్టర్ల కు సూచనలు చేశారు. ఆర్టీసీ డీవీఎం వేములవాడ శ్రీకృష్ణ, మూడు డిపోల మేనేజర్లు, జిల్లా ఎస్సీ సునీల్ దత్ ఆదేశాలతో కొత్తగూడెం డీఎస్పీ ఎస్ ఎం ఆలీ, సీఐలు సత్యనారాయణ, ఎల్ రాజు, కరుణాకర్‌లు, జిల్లా రవాణాశాఖాధికారి రవీందర్‌లు, అధికారులు డ్రైవర్లకు సూచనలు చేస్తూ బా ధ్యతగా విధులు నిర్వహించాలని హెచ్చరించారు. రోడ్డెక్కిన బస్సులు

మూడు డిపోల నుంచి మొత్తం 90శాతంపైగా బస్సులు రోడ్డెక్కి ప్రయాణీకులను సాఫీగా వారి గమ్యస్థానాలకు చేర్చింది. మూడు డిపోలలో మొ త్తం ఆర్టీసీ, అద్దె బస్సులు 268బస్సులు ఉండగా 245బస్సులు ఆదివారం నడిపినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. కొత్తగూడెం డిపోలో 65బస్సులు ఉండగా 58బస్సులు, భద్రాచలం డిపోలో 81బస్సులు ఉండగా 72బస్సులు, మణుగూరు డిపోలో 54బస్సులు ఉండగా 51బస్సులు నడుపగా, లద్దె బస్సులు కొత్తగూడెంలో 22 బస్సులకుగాను 20, భద్రాచలంలో 25బస్సులకు గాను 23, మణుగూరు డిపోలో 21బస్సులకు 21బస్సు సర్వీసులను నడిపామని చెప్పారు. మొత్తంగా 90శాతంపై గా బస్సులు జిల్లా వ్యాప్తంగా నడిపినట్లు చెప్పారు.

మణుగూరు నుంచి నిరంతరం బస్సు సర్వీసులు..
మణుగూరు రూరల్: ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మె ప్రభావం మణుగూరులో కనిపించలేదు. ఆదివారం భ ద్రాచలం సబ్‌కలెక్టర్ భవేశ్‌మిశ్రా మణుగూరు డిపోను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. బస్సు ల్లో టికెట్లు ఇస్తున్నారా లేదా, ఇప్పటి వరకు వచ్చిన ఆదాయం ఎంత అని అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లతో పాటు ఆర్టీ సీ, ప్రైవేట్ బస్సులను సిద్ధంగా ఉంచామని, ఆదివా రం 49ఆర్టీసీ, 21 అద్దె బస్సులు మొత్తం 70 బస్సు సర్వీసులను నడపడం జరిగిందని సబ్‌కలెక్టర్‌కు ఆర్టీసీ డీఎం విజయ్‌కుమార్ తెలిపారు. డిపో మేనేజర్ పోలీసులు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేశారు. ఆర్టీసీ బస్సులతో పాటు అద్దె బస్సులను తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల ద్వారా సర్వీసులను యదావిధిగా పంపించారు. డిపో వద్ద, బస్‌స్టాండ్, మెయిన్ సెం టర్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఏఎస్పీ సాయిబాబా పర్యవేక్షణలో సీఐ షుకూర్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.

283
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles