కరాటే పోటీలు నిర్వహించడం అభినందనీయం : ఎమ్మెల్యే సండ్ర

Fri,November 1, 2019 12:53 AM

సత్తుపల్లి, నమస్తే తెలంగాణ : పట్టణంలో 19వ జాతీయస్థాయి బుడోకాన్ కరాటే చాంఫియన్‌షిప్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. గురువారం ఈ సందర్భంగా కరాటే టోర్నమెంట్ వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 15 రాష్ర్టాల నుంచి దాదాపు 1000మంది విద్యార్థులు డిసెంబరు 27, 28, 29 తేదీల్లో సత్తుపల్లిలో జరిగే పోటీలకు హాజరుకావడం సత్తుపల్లి చరిత్రకే ఒక ప్రధాన ఘట్టమన్నారు.

విద్యార్థుల శారీరక, మానసిక ధారుడ్యానికి కరాటే ఎంతగానో ఉపయోగపడుతుందని, ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వం అన్ని ఉన్నత పాఠశాలల్లో బాలికలకు కరాటే శిక్షణా కార్యక్రమం నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో నిర్వహిస్తుందన్నారు. స్థానిక మాధురి ఫంక్షన్‌హాల్‌లో జరిగే ఈ పోటీలకు హాజరవుతున్న క్రీడాకారులకు ఉచిత, భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఖమ్మం, కొత్తగూడెం, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన బాధ్యులు నిర్వహిస్తున్నట్లు కరాటే మాస్టర్ పిచ్చయ్య తెలిపారు. కార్యక్రమంలో చిత్తలూరి ప్రసాద్, బాలస్వామి, సుందర్‌రావు, జీఎన్‌వీ.ప్రసాద్, కొత్తూరు ఉమామహేశ్వరరావు, నక్కా రాజేశ్వరరావు, ఏఎస్.ప్రకాష్‌రావు, బి.వెంకట్రావు, కోట సత్యనారాయణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

206
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles