ప్లాస్టిక్ వాడకాన్ని అరికడదాం

Fri,November 1, 2019 11:41 PM

ఖమ్మం, నమస్తే తెలంగాణ : ఎన్‌ఆర్‌ఐ పేరెంట్స్ అసోసి యేషన్ ఆధ్వర్యంలో గత మూడు నెలలుగా నిర్వహిస్తున్న ప్లాస్టిక్ వాడకాన్ని అరికడదాం, ప్రకృతిని, ఆరోగ్యాన్ని కాపాడు దాం అనే కార్యక్రమంలో భాగంగా గోనె సంచులు, గుడ్డ సంచులను జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జడ్పీ సీఈవో ప్రియాంకలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవాళి మనుగడకు మహోపకారం చేద్దాం అనే నినాదంతో ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తూ, ప్రజలతో ప్రతిజ్ఞ చేయిస్తున్న ఎన్‌ఆర్‌ఐ పేరెంట్స్ అసోసియేషన్‌ను అభినందించారు. విద్యార్థులు, ప్రజలు చైతన్యవంతులను చేస్తున్నారని తెలిపారు. ఇదే సందర్భంలో కొన్ని ప్రాంతాల్లో గోనె సంచులు,గుడ్డ సంచులు పంపిణీ చేశారు. ముఖ్యంగా విద్యార్థులకు అవగాహన కొరకు ప్రత్యేక సెమినార్లు నిర్వహిస్తున్నారు. శుక్రవారం జడ్పీ సమావేశ మందిరంలో 225 జూట్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు యలమద్ది వెంకటేశ్వర్లు, కార్యదర్శి చానార రమేష్ బాబు, సుదర్శన్‌రావు, సీతా రాఘవయ్య, డి శ్రీనివాసరావు, వై శ్రీని వాసరావు, స్వరూపారాణి, సంధ్యా, వెకట్రావు పాల్గొన్నారు.

165
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles