ఘనంగా స్వామివారి నిత్యకల్యాణం

Fri,November 1, 2019 11:41 PM

భద్రాచలం, నమస్తే తెలంగాణ నవంబర్1: భద్రాచలం రామాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం అర్చకులు గోదావరి నది నుంచి తీర్థబిందెను తీసుకొచ్చి రామునికి అభిషేకం చేశారు. ఆరాధన, అర్చన, సేవా కాలం, నివేదన, పుణ్యఃవచనం తదితర పూజలు గావించారు. వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలం వచ్చిన భక్తులు రామాల యానికి చేరుకొని రామున్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ఉన్న శ్రీలక్ష్మీతాయారు అమ్మవారిని, అభయాంజనేయస్వామివారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. రుష్యమూక మ్యూజియంను సందర్శించి సీతమ్మవారి నగలను ఆసక్తిగా తిలకించారు. అనంతరం అర్చకులు ఆలయంలోని బేడా మండపంలో రామయ్యకు ఘనంగా నిత్యకల్యాణం నిర్వహించారు. భక్తులు కల్యాణంలో పాల్గొని తిలకించి పునీతులయ్యారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

156
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles