ఎంపీ నామాను కలిసిన న్యూయార్క్ సెనేటర్

Fri,November 1, 2019 11:42 PM

ఖమ్మం నమస్తేతెలంగాణ: న్యూయార్క్ సెనేటర్ కేవిస్ సోని పార్కర్, ప్రభాకర్, ప్రాంక్లిన్ నేతృత్వంలోని 10 మంది సభ్యులు, అమెరికన్ బృందం ఖమ్మంలో శుక్రవారం టీఆర్‌ఎస్ లోక్‌సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావును కలిశారు. భారతదేశ పర్యటనలో భాగంగా ఖమ్మం వచ్చిన వారు నగరంలో ఐదు రోజుల పాటు ఉన్నారు.స్థానిక మిషన్ హాస్పిటల్ కేంద్రంగా వారు పలు ప్రాంతాలలో పర్యటించారు. పలు విషయాల గురించి తెలుసుకుంటున్న క్రమంలో గతంలో ఎంపీగా ఉన్న సమయంలో, ప్రస్తుతం ఎంపీగా పార్లమెంట్‌లో ప్రజా వాణిని వినిపించడం, ప్రజలతో నిరంతర సంబంధాలు కలిగి ఉండటం తదితర విష యాలు తమ దృష్టికి వచ్చాయని, ఆయన చేసిన అభివృద్ధిని స్వయంగా పరిశీలన జరిపిన అనంతరం నామాను వ్యక్తిగతంగా కలవాలని నిర్ణయించుకున్నామని నామాను కలిసిన సందర్భంలో సెనేటరు కేవిస్ అన్నారు.ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో పార్లమెంట్ సభ్యునిగా ఉన్న వ్యక్తి సామాన్యుడిగా జనంతో కలిసి మెలిసి ఉండటం ప్రత్యక్షంగా చూడగలగటం చాలా ఆనందంగా ఉందన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ నామా మాట్లాడుతూ అమెరికన్ సేనేటర్ తన ఇంటికి రావడం, వారితో పాటు మరికొంత మంది అక్కడి వ్యాపారులు, ఇతర రంగాలకు చెందిన వారు కూడా రావడం వారికి తాను ఆతిథ్యం ఇవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు.సీఎం కేసీఆర్ నాయకత్వంలో నడిచిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం , ఆనాడు కూడా పార్లమెంట్ సభ్యునిగా కేసీ ఆర్‌తో ఉన్న తాను తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం పార్లమెంట్‌లో తొలి ఓటు వేశానని విషయాన్ని అమెరికా బృందానికి తెలిపారు. సెనేటర్ వెంట అక్కడి సోలార్ సిస్టం తయారీ పరిశ్రమ యజమాని జేమ్స్‌ఫాన్, టాంఎయుట్ తదితరులున్నారు. సుమారు గంట పాటు వారు నామా నాగేశ్వరరావు వెంట ఉన్నారు. ఈ సందర్భంగా మద్దినేని బేబి స్వర్ణకుమారి, తుళ్లూరు బ్రహ్మయ్య, చిత్తారు సింహాద్రి యాదవ్, మందపాటి వెంకటేశ్వరరావు, గొల్లపూడి హరి, పాల్వంచ రాజేష్, చీకటి రాంబాబు, గోపి తదితరులు పాల్గొన్నారు.

215
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles