సత్తుపల్లి రూపురేఖలు మారుస్తా..

Sun,November 3, 2019 03:17 AM

సత్తుపల్లి, నమస్తే తెలంగాణ : సత్తుపల్లి పట్టణ అభివృద్ధికి సీఎం కేసీఆర్, పురపాలక శాఖామంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో కోట్ల నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్నామని, ఇదేరీతిలో మున్ముందు కొనసాగించి పట్టణ రూపురేఖలు మారుస్తానని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శనివారం పట్టణంలోని విరాట్‌నగర్‌లో రూ.30లక్షలతో నిర్మించ తలపెట్టిన కమ్యూనిటీ హాల్ భవనం, గుడిపాడులో రూ.20లక్షలతో నిర్మించ తలపెట్టిన కమ్యూనిటీ హాల్ భవనం, హిందూ శ్మశాన వాటికలో రూ.1.75 కోట్లతో నిర్మించ తలపెట్టిన అభివృద్ధి ప నులు, శ్మశానవాటికలో రూ.40లక్షలతో నిర్మించ తలపెట్టిన కర్మల భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ సత్తుపల్లి పట్టణంలోని అంతర్గత రహదారులన్నింటినీ ఇప్పటికే పూర్తిస్థాయిలో సీసీ రోడ్లుగా మార్చామని, మిగిలిన పనులను కూడా అతిత్వరలో పూర్తి చేసి సత్తుపల్లిని జిల్లాకు ఆదర్శంగా నిలుపుతామన్నారు. ఖమ్మం తర్వాత సత్తుపల్లి మునిసిపాలిటీ, అభివృద్ధిలో ముందుకు సాగుతుందన్నారు. ఇదే తరహాలో మునిసిపాలిటీని అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నెంబర్‌వన్ మునిసిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు.

రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని ప్రతిపక్షాలు చేస్తున్న మాటల్లో నిజంలేదని, దీనికి హుజూర్‌నగర్ ఎన్నికలే సాక్ష్యమని గుర్తు చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా ప్రజలు మాత్రం వాటిని గమనిస్తూనే ఉన్నారన్నారు. త్వరలో పట్టణంలో రూ. 2.50కోట్ల వ్యయంతో డ్రెయిన్ నిర్మాణం కూడా చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. అటవీశాఖ ఆధ్వర్యంలో పార్కు అభివృద్ధి, వేశ్యకాంతల చెరువు, దామెరచెరువును ట్యాంక్‌బండ్‌లుగా అభివృద్ధి చేసి పట్టణ ప్రజల ఆహ్లాదం కోసం తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డా హైమావతి శంకర్‌రావు, జడ్పీటీసీ కూసంపూడి మాధవరావు, డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్, కమిషనర్ చీమా వెంకన్న, చల్లగుళ్ల నర్సింహారావు, చల్లగుళ్ల కృష్ణయ్య, కూసంపూడి మహేశ్, రామారావు, దొడ్డాకుల గోపాలరావు, అనిల్, మునీర్, చాంద్‌పాషా, తడికమళ్ల ప్రకాష్‌రావు, గోపి, మారుతి బాబూరావు, మారగాని గురవయ్య, భానుప్రకాశ్ పాల్గొన్నారు.

186
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles