ప్లాస్టిక్ రహిత పరిణయం

Sun,November 3, 2019 11:47 PM

మయూరి సెంటర్/రఘునాథపాలెం: పెళ్లి అంటే సాధారణంగా ఎక్కడో ఒకచోట ప్లాస్టిక్ వస్తువు ఏదో ఒక రూపంలో అని వార్యమవుతుంది. తాగే నీళ్ల గ్లాసు వద్ద నుంచి మొదలుకుంటే అన్నింటా ప్లాస్టిక్ వస్తువులు కనపడతాయి. అయితే ఈ పెళ్లిలో ప్లాస్టిక్ అనేది ఎక్కడా కనపడలేదు. తెలంగాణ ప్రభుత్వం ప్లాస్టిక్‌ను అరికట్టడమే లక్ష్యంగా అడుగులేస్తున్న క్రమంలో మేము సైతం అంటూ ప్లాస్టిక్ రహిత పెళ్లి జరిపించాలనే తలంపుతో ఆదర్శంగా నిలిచింది ఖమ్మం నగరానికి చెందిన ఓ కుటుంబం. నగరంలోని కమాన్‌బజార్ వల్లాలవారి వీధికి చెందిన వేములపల్లి లావణ్య-సీతారాంబాబుల తనయ షర్మిష్ట-ఆదిత్య వివాహ మహోత్సవం ఆదివారం జిల్లా కేంద్రంలోని బోనకల్ రోడ్డులోని లక్ష్మీ గార్డెన్స్‌లో జరిగింది. అనేక మంది ఘనంగా వివిధ రూపాలలో వివాహ తంతు నిర్వహిస్తున్న నేపథ్యంలో న్యాయవాది సీతారాంబాబు మాత్రం పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వినియోగం లేకుండా అరటి ఆకు, మట్టితో తయారు చేసిన పాత్రలు, బెరడుతో చేసిన చెంచాలతో వివాహ విందును అందించి ఔరా అనిపించారు.

అలంకరణలో కూడా ప్లాస్టిక్ వాడకుండా కేవలం కొమ్మరి మట్టల ఆకులు, కొబ్బరి లేక ఆకులతో తయారు చేసిన చిలకలతోనే మండపం ద్వారం నుంచి కల్యాణ మండపం వరకు అందంగా అలంకరించారు. ఈ పెళ్లికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర రవా ణాశాఖ మాత్యులు పువ్వాడ అజయ్ కుమార్ సైతం వినూత్న పద్ధతిలో కనిపించిన ప్లాస్టిక్ రహిత మండపాన్ని చూసి పెళ్లి నిర్వాహకులను, రావూరి ఈవెంట్స్‌ను అభినందించారు.

186
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles