మంత్రి అజయ్‌తో అమెరికా క్యాన్సర్ వైద్య బృందం భేటీ

Mon,November 4, 2019 11:56 PM

ఖమ్మం, నమస్తే తెలంగాణ : మమత ఆసుపత్రి, బాగం రంగయ్య మెమోరియల్ పాలి క్లినిక్ సంయుక్త ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మల్ల్లేపల్లి గ్రామంలో సోమవారం (4వ తేదీ) నుంచి 7వ తేదీ వరకు వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఆస్ట్రేలియా, కాలిఫోర్నియా, అమెరికా నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య బృందం సోమవారం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారితో పలు అంశాలపై చర్చించారు. ఇటీవలే చాప కింద నీరులా వ్యాప్తి చెందుతున్న క్యాన్సర్, గర్భాశయం, రొమ్ముక్యాన్సర్ సమస్యలను ఆదిలోనే గుర్తించి నివారించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు ప్రత్యేక బాధ్యత తీసుకున్న వైద్య బృందాన్ని మంత్రి అభినందించారు. క్యాన్సర్ మహమ్మరిని సమూలంగా నిర్మూలించాలని అందుకు మరిన్ని వైద్య శిబిరాలు నిర్వహించాల్సి ఉందన్నారు. శిబిరం ముగిసే వరకు వైద్య బృందానికి నాలుగు రోజుల పాటు మమత అతిథి గృహంలో అతిథ్యమిచ్చారు. మమత ఆసుపత్రి సూపరింటెండెంట్ బాగం కిషన్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించే వైద్య శిబిరంలో వైద్య బృందం డాక్టర్ మెలిసా, డాక్టర్ సమత కడియాల, డాక్టర్ జెన్నీష (కాలిఫోర్నియా) తదితరులున్నారు.

181
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles