మంత్రి కేటీఆర్‌ను కలిసిన

Thu,November 7, 2019 12:36 AM

-ఎంపీ నామా,వైరా ఎమ్మెల్యే రాములునాయక్
ఖమ్మం/వైరా,నమస్తే తెలంగాణ : ఖమ్మం ఎంపీ, టీఆర్‌ఎస్ లోక్‌సభ పక్షనేత నామా నాగేశ్వరరావు, వైరా శాసన సభ్యులు రాములు నాయక్‌లు బుధవారం హైద్రాబాద్‌లోని ప్రగతి భవన్‌లో రాష్ట్ర మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి మొక్కను బహూకరించారు. ఈ సందర్భంగా హుజూర్ నగర్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేసిన ఎంపీ నామాకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. అలానే రానున్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు విషయంలో మునుపటిలాగా తెలంగాణ గళం గట్టిగా వినిపించాలని నామా నాగేశ్వరరావుకి కేటీఆర్ సూచించారు. ముఖ్యమంగా హామీల విషయంలో కేంద్రం పై ఒత్తిడి తేవాలని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో పార్టీ ప్రజా ప్రతినిధుల పాత్ర కీలకంగా ఉండాలని అన్నారు. వైరా నియోజకవర్గంలో పలు సమస్యలను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు,అలాగే మున్సిపాలిటీ అభివృద్ధికి,నియోజకవర్గ పరిధిలోని మండలాల అభివృద్ధి,సంక్షేమానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.అందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్ నియోజకవర్గ అభివృద్ధికి,మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు కేటాయిస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు.

143
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles