రైతులకు పంట నష్టపరిహారం అందించాలి..

Thu,November 7, 2019 12:37 AM

కూసుమంచి: కూసుమంచి మండల పరిధిలోని నర్సింహులగూడెం, కిష్టాపురం, కూసుమంచి గ్రామాల్లో ఈనెల 2న కురిసిన భారీవర్షానికి సుమారు 300 ఎకరాల్లో వరిపైర్లు దెబ్బతిన్నాయని, తమకు పరిహారం ఇప్పించాలని బాధిత రైతులు స్థానిక ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డికి విజ్ఞప్తిచేశారు. స్పందించిన ఎమ్మెల్యే ఫోన్‌లో కలెక్టర్ ఆర్.వీ.కర్ణన్‌తో మాట్లాడారు. వ్యవసాయాధికారులతో పంట నష్టాన్ని అంచనావేయించి, పరిహారం ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. తన విజ్ఞప్తి మేరకు పంట నష్టం అంచనాలు వేసి, నివేదిక ఇవ్వాలని జేడీఏ ఝాన్సీలక్ష్మీకుమారిని ఆదేశించినట్లు ఎమ్మెల్యే తెలి పారు. పంటనష్టాన్ని పరిశీలించడానికి వచ్చే వ్యవసాయాధికారులకు రైతులు దెబ్బతిన్న తమ పొలాలను చూపించి, నివేదిక రూపొందిచేలా సహకరించాలని ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి సూచించారు.

162
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles