ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో తక్షణమే చర్యలు తీసుకోవాలి

Thu,November 7, 2019 12:37 AM

ఖమ్మం క్రైం: బాధితులకు న్యాయం జరిగేలా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను సమర్థవంతంగా పరిష్కరించాలని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ అన్నారు. బుధవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని సబ్- డివిజన్ పోలీస్ అధికారులతో పోలీస్ కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ల వారీగా నమో దైన కేసులను, వారిపై తీసుకున్న చర్యలపై పోలీస్ కమిషనర్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ కేసుల పరిశీలన ఆలస్యమైతే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున వీటిని వేగంగా పరిశీలించా లన్నారు. ఇప్పటికే కేసులు నిర్ధారణ అయి నష్టపరిహారం కోసం వేచిచూస్తున్న కేసులకు సంబంధించిన బాధితులకు త్వరగా పరిహారం అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుల వివరాలను వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కమిటీ దృష్టికి వచ్చే కేసుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సాక్షులను ప్రవేశపెట్టగలిగితే కేసుల్లో పురోగతి జరిగి బాధితులకు త్వరగా న్యాయం జరుగుతుందన్నారు.

ప్రతీమూడు నెలలకోసారి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల సమీక్ష సమావేశం నిర్వహించాలని సూచించారు. 2019 లో ఖమ్మం డివిజన్ పరిధిలో 8 కేసులు, రూరల్ డివిజన్ పరిధిలో 29, వైరా డివిజన్ పరిధిలో 18 కేసులు, కల్లూరు డివిజన్ పరిధిలో 11 కేసులు, జిల్లా వ్యాప్తంగా మొత్తం 66 కేసులు నమో దైయ్యాయని తెలిపారు. కొన్ని కేసుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేయగా మిగతా కేసుల్లో విచారణ కొనసాగుతుందని తెలిపారు. ఆయా కేసుల్లో సాక్షులను విచారించి బా ధితులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఏసీపీలను ఆదేశించా రు. ఈ సమావేశంలో ఏఆర్ అడిషనల్ డీసీపీ మాధవరావు, ఏసీపీలు ఘంటా వెంకట్రావు, రామోజీ రమేష్, సత్యనారాయణ, వెంకటేశ్, ఎస్‌బీ సీఐ సంపత్ కుమార్, సీసీఆర్‌డీ సీఐ శివసాంబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

169
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles