ఎర్రబంగారం ..

Thu,November 7, 2019 12:40 AM

-ఖమ్మం మార్కెట్‌లో ఏసీ మిర్చి రికార్డు స్థాయి ధర
-హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు, వ్యాపారులు
-పొరుగు రాష్ర్టాల్లో వర్షాలకు దెబ్బతిన్న మిర్చి పంట
ఖమ్మం వ్యవసాయం: గతంలో ఎన్నడూ లేని విధంగా తేజా రకం ఏసీ మిర్చి పంటకు రికార్డు స్థాయి ధర పలికింది. దీంతో రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో ధర పలకడం ఇదే తొలిసారి కావడం విశేషం. బుధవారం ఉదయం నగర వ్యవసాయ మార్కెట్‌లో జరిగిన జెండా పాటలో రికార్డు స్థాయి లో క్వింటాకు ఒక్కంటికి రూ 17,800 ధర నిర్ణయించి పంటను మిర్చి ఖరీదు దారులు కొనుగోలు చేశారు. ఇంతకాలం శీతల గిడ్డంగులలో నిల్వ ఉంచుకున్న రైతులు, వ్యాపారులకు కలిసి వచ్చినైట్లెంది. సీజన్
ఆరంభంలో ఇదే రకం పంట కు క్వింటా ఒక్కంటికి గరిష్ట ధర రూ 9,500 12 వేలు లోపు మాత్రమే ధర పలికింది. ఇది కాస్త అంచెలంచెలుగా పెరుగుకుంటూ ఏకంగా క్వింటాకు రూ 17,800 వేల పైచిలుకు పెరగడంతో అటు అధికారులతో పాటు, ఇటు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ మార్కెట్లో తేజా రకం మిర్చి పంటకు మంచి డిమాండ్ ఉండటం అవసరమైన మేర పంట ఉత్పత్తులు లేక పోవడంతో ధరల పెరుగుదలకు ప్రధాన కారణం అని వ్యాపారులు పేర్కొంటు న్నారు. సీజన్ ఆరం భంలో కొందరు రైతులు మార్కెట్ల పంటను విక్రయిం చుకోగా, మరికొందరు రైతులు భవిష్యత్‌లో మరింత ధర పెరిగే అవకాశం ఉందనే ఉద్దేశంతో కోల్డ్‌స్టోరే జీల్లో పంటను నిల్వ ఉంచుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి పంట మార్కెట్‌కు రాకపోవడం, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరడంతో తిరిగి రైతులు నిల్వ ఉంచిన పంటను అమ్ముకునేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. ఉదయం మార్కెట్లో జరిగిన జెండాపాటలో ఏసీ రకం మిర్చికి గరిష్ట ధర క్విం టాకు రూ 17,800 పలికింది. సాధారణ రకం పంటకు గరిష్ట ధర క్వింటాకు రూ 8, 800 పలుకగా, కనిష్ట ధర 6వేలు పలికింది. తాలు రకం పంటకు క్వింటాకు ఒక్కంటికి రూ 4వేలు చొప్పున ధర నిర్ణయించి వ్యాపారులు పంటను కొనుగోలు చేశారు. జాతీయ మార్కెట్లో సైతం తేజారకం పంటకు మంచి డిమాండ్ ఉండటంతో స్థానిక ఖరీదుదారులతో పాటు మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఢిల్లీకి చెందిన వ్యాపారులు పంటను కొనుగోలు చేస్తున్నారు.పొరుగు రాష్ర్టాలో కురిసిన వర్షాల ప్రభావంతో మిర్చిపంట ఎక్కువ మొత్తంలో సాగు జరిగే మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్టాలలో భారీ వర్షాలతో మిర్చి పంటకు తీవ్ర నష్టం జరిగింది. పంట

ముందస్తుగా వచ్చే సదరు రాష్టాలలో ఇప్పటికే అక్కడ రైతులు పంటను తీసే పనులలో నిమగ్నమయ్యారు. గత కొద్ది రోజుల నుంచి కలాల్లలో మిర్చి పంట తడుస్తుడంటంతో నాణ్యత కోల్పోవడం జరిగింది. దీంతో ఎగుమతులు చేసే వ్యాపారులు ఇతర రాష్టాలలో పంటను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు అందులో భాగంగానే తెలంగాణలో ఎక్కువ మొత్తంలో మిర్చి పంట సాగు జరిగే ఖమ్మం , వరంగల్, నల్గొండ జిల్లాలోని మార్కెట్లలో సదరు ఖరీదుదారులు వారి అనుచరుల ద్వార పంటను కొనుగోలు చేస్తున్నారు. పంట తక్కువగా ఉండటం జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మంచి డిమాండ్ ఉండటంతో ఎర్రబంగారం ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చినైట్లెంది. ఒకటి రెండు నెలలో మిర్చి నూతన పంట చేతికి వచ్చే సమయంలో మార్కెట్లో మంచి ధర పలుకుతుండటంతో ఈ ఖరీఫ్‌లో సాగు చేసిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం సైతం జిల్లాలో సాగు చేసిన రైతులకు ఆశించిన మేర ధర పలికే అవకాశం స్పష్టంగా ఉందని మిర్చి ఖరీదుదారులు పేర్కొంటున్నారు.

189
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles