ఖమ్మం, నమస్తే తెలంగాణ : నేటి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ లోక్‌సభ పక్షనేత, పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు పర్యటించనున్నారు. జిల్లాలలోని మధిర నియోజకవర్గంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం నియోజకవర్గంలో ఎంపీ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు, శుభకార్యాల్లో పాల్గొననున్నారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్ నుంచి ఎంపీ నామా ఖమ్మం చేరుకున్నారు. శని, ఆది వారాలు జిల్లాలో పలు కార్యక్రమాలలో ఆయన పాల్గొననున్నారు.
నేడు, రేపు పొంగులేటి పర్యటన
ఖమ్మం, నమస్తే తెలంగాణ : ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి శని, ఆదివారాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నట్లు పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఎర్రుపాలెం, మధిర, తల్లాడ, కొణిజర్ల, ఖమ్మం, పాల్వంచ, కొత్తగూడెం, ఆదివారం ఖమ్మం నగరంతోపాటు ముదిగొండ, రఘునాథపాలెం, తల్లాడ, కొణిజర్ల, నేలకొండపల్లి మండలాల్లో పర్యటిస్తారని వివరించారు. పలు వివాహ శుభకార్యాలు, నూతన గృహ ప్రవేశాలకు హాజరువుతారని తెలిపారు. ఇటీవల మృతిచెందిన పొంగులేటి అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకుల కుటుంబాలను పరామర్శిస్తారని పేర్కొన్నారు.