ఘనంగా అయ్యప్ప మహాపడిపూజ

Sun,November 10, 2019 12:07 AM

తల్లాడ : హరిహరసుత అయ్యప్పస్వామి మహాపడిపూజ మహోత్సవాన్ని శుక్రవారం రాత్రి తల్లాడలోని విజయవర్ధిని రైస్‌మిల్ వద్ద కనులపండువగా నిర్వహించారు. తల్లాడకు చెందిన బండారు అఖిల్‌సాయిస్వామి ఆధ్వ ర్యంలో మహాపడిపూ జ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గురు స్వామి నుదురుపాటి ప్రసాదశర్మ ఆధ్వర్యం లో ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తిపాటల గాయకుడు కోదాడ భాస్కర్‌గురుస్వామి ఆలపించిన భక్తిగీతాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అంటూ అయ్యప్ప నామస్మరణతో పడిపూజ ప్రాంగణం మారుమ్రోగింది. గురుస్వామి గణపతిపూజ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప మా లదారులు నగర సంకీర్తనలు నిర్వహించారు. పంచామృతా లు, నవరసాలతో అభిషేక పూజలు నిర్వహించారు.అనంతరం పదునెట్టాంబడిని వెలిగించారు. అయ్యప్ప మాలదారులకు అల్పాహా రం అందజేశారు. ఈ పూజ కార్యక్రమంలో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి భజనలో పాల్గొన్నారు. కార్యక్రమంలో గురుస్వాములు పెరిక నాగేశ్వరరావు, సరికొండ శ్రీనివాసరాజు, ఎర్రి నరసింహారావు, బొడ్డు కృష్ణయ్య, కొమ్మినేని రామయ్య, ధనకొండ కృష్ణయ్య, గుడిపల్లి సత్యం పాల్గొన్నారు.

220
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles