ఎద్దుల బండ లాగుడు పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే కందాల

Mon,November 11, 2019 01:57 AM

నేలకొండపల్లి, నవంబర్ 10: మండలంలోని రాజేశ్వరపురం గ్రామంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఏర్పాటు చేసి ఎద్దుల బండలాగుడు పోటీలను పాలేరు శాసన సభ్యులు కందాల ఉపేందర్‌రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే కందాల మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి సందర్భంగా గ్రామంలో ఎద్దుల పోటీలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్తీకపౌర్ణమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలన్నారు. అనంతరం ఎద్దుల బండలాగుడు పోటీలనుప్రారంభించారు. మొదటిరోజు పాలపళ్లు విభాగంలో వివిధ జిల్లాల నుంచి ఆరు జతలు ఎద్దుల బల ప్రదర్శనలో పోటీపడ్డాయి. ఈకార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్ పర్సన్ మరికంటి ధనలక్ష్మి, ఎంపీపీ వజ్జా రమ్య, డాల్డా చైర్మన్ కొర్లకుంట నాగేశ్వరరావు, సర్పంచ్ దండా పుల్లయ్య, ఎంపీటీసీ జటంగి చంద్రమ్మ, సొసైటీ చైర్మన్ దండా ప్రవీణ్‌కుమార్, సర్పంచ్‌లు ఉన్నం బ్రహ్మయ్య, గండు సతీష్, రమేష్, పార్టీ మండల కార్యదర్శి కోట సైదారెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు చెరువు స్వర్ణ, కార్యదర్శి రాళ్లబండి రాజకుమారి, నంబూరి సత్యనారాయణ, కొడాలి గోవిందరావు, అనగాని నరసింహరావు, వెన్నబోయిన శ్రీనివాసరావు, దండా రంగయ్య, బోనగిరి కిరణ్, పోలంపల్లి ఉపేందర్ పాల్గొన్నారు.

పోటీలను తిలకించిన మాజీ ఎంపీ పొంగులేటి..
రాజేశ్వరపురంలో నిర్వహించిన ఎద్దుల బలప్రదర్శన పోటీలను మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం సాయంత్రం తిలకించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా గ్రామంలో వివిధ విభాగాల్లో ఎద్దుల బలప్రదర్శన పోటీలను నిర్వహించారు. మాజీ ఎంపీ వెంట సర్పంచ్ దండా పుల్లయ్య, ఎంపీటీసీ జటంగి చంద్రమ్మ, సొసైటీ చైర్మన్ దండా ప్రవీణ్‌కుమార్, టీఆర్‌ఎస్ పార్టీ మండల కార్యదర్శి కోటి సైదారెడ్డి, కొడాలి గోవిందరావు, దండా రంగయ్య, ఎర్రబోయిన నర్సయ్య, మరికంటి రేణుబాబు, జటంగి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

పాలపళ్ల విభాగంలో విజేతలు
ఎద్దుల బలప్రదర్శన పోటీల్లో పాలపళ్ల విభాగంలో గుంటూరుకు చెందిన నెట్టెం గీతాచౌదరి, చావింటి రవిరత్నసాయిలకు చెంది ఎద్దులు 3400 అడుగుల దూరం పరుగెత్తి మొదటిస్థానం నిలిచాయి. దేవరం సుజితా, సుధాకర్‌రెడ్డి, కొప్పుల హేమలత, శ్రీనివాసరెడ్డిల ఎద్దులు 3181 అడుగుల దూరం పరుగెత్తి రెండో స్థానంలో నిలిచాయి. ఆవుల రమణరెడ్డికి చెందిన ఎద్దులు 2643 అడుగుల దూరం పరుగెత్తి మూడో స్థానంలో, ముత్యాలంపాటి ఖాసీంకు చెందిన ఎద్దులు 2609 అడుగుల దూరం పరుగెత్తి నాలుగో స్థానంలో, విన్నగండ్ల కవితారెడ్డికి చెందిన ఎద్దులు 2400 అడుగుల దూరం పరుగెత్తి ఐదో స్థానంలో నిలిచాయి. గెలిచిన వారికి నగదు బహుమతులను అందించారు.245
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles