గిరిజన యువతీ, యువకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానం

Wed,November 13, 2019 11:57 PM

భద్రాచలం, నమస్తే తెలంగాణ నవంబర్ 13 : భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గల గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులకు అపోలో మెడ్ స్కిల్స్ ద్వారా జనరల్ డ్యూటీ అసిస్టెంట్ (జీడీఏ), ఫార్మసి అసిస్టెంట్ (పీఏ), పేషెంట్ రిలేషన్ అసోసియేట్, హాస్పటల్ ఫ్రంట్ డెస్క్ కోఆర్డినేటర్ (హెచ్‌ఎఫ్‌డీసీ) కోర్సులకు గిరిజన యువతీ, యువకుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీవో వీపీ గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. న్యాక్ హైదరాబాద్ ద్వారా అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, అసిస్టెంట్ వర్క్ సూపర్ వైజర్, అసిస్టెంట్ సర్వేయర్, ఫాల్స్ సీలింగ్ అండ్ డ్రై వాల్ ఇన్‌స్టాలర్ కోర్సులకు ఉచిత శిక్షణతో పాటు ఉపాధి కల్పించబడునని, ఆసక్తి గల గిరిజన యువతీ, యువకులు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. అర్హత 8వ తరగతి, ఆపై, శిక్షణ కోసం కులం, ఆదాయం, ఆధార్‌కార్డు, పాస్‌ఫోటోలు, స్టడీ పత్రాలతో ఐటీడీఏ భద్రాచలం ప్రాంగణంలో (హౌసింగ్ గెస్ట్‌హౌస్ పక్కన) వైటీసీ భవనం లో ఈనెల 15వ తేదీన దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఎంపిక చేయబడిన అభ్యర్థులకు హైదరాబాద్‌లో ఉచిత శిక్షణ, వసతితోపాటు ఉపాధి కల్పించబడునని ఐటీడీఏ పీవో వీపీ గౌతమ్ తెలిపారు.

277
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles