చైతన్యమే.. శ్రీరామ రక్ష

Wed,November 20, 2019 01:14 AM

మయూరిసెంటర్ : దోమ కాటు తో వస్తున్న జ్వరాలను నివారించేందుకు విద్యార్థులలో అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణను చేపట్టింది. ప్రతి వారంలో మంగళ, శుక్రవారాల్లో విద్యార్థులు తప్పని సరిగా డ్రైడేలుగా పాటించి పరిసరాలు పరిశుభ్రతను పాటించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచినప్పుడే దోమలు వృద్ధి చెందకుండా ఉంటాయి. వాతావరణ సమతుల్యతతో వచ్చిన మార్పులకు అనుగుణంగా కురిసిన వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు విజృంభించాయి. దోమలు నిల్వ ఉన్న నీటిని ఆవాసాలుగా చేసుకుని ప్రజలను కుట్టడం వల్ల వైరల్ జ్వరాలుగా మొదలై, మలేరియా, డెంగ్యూ, చికెన్‌గున్యా జ్వరాలు వ్యాపించాయి. మనం పరిశుభ్రంగా ఉండడంతో పాటు స్వచ్ఛాభారత్ కార్యక్రమం తరహాలో ప్రతి నివాసంలో ఉన్న ఉపయోగంలో లేని కూలర్లు, ఇతర నీటి నిల్వ ఉన్న వస్తువులు టైర్లను నివాసులకు దూరంగా పడవేయాలి. అప్పుడే దోమలు వృద్ధి చెందకుండా ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం దోమలను నివారించేందుకు గంబూషియా చేపలు, ఆయిల్ బాల్స్‌లను నిల్వ ఉన్న నీరు, డ్రైనేజీ కాలువల్లో వేస్తూ దోమల నివారణ కోసం పటిష్టమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంది. ఇందులో భాగంగానే పాఠశాలల స్థాయిలో విద్యార్థులకు డెంగ్యూ జ్వరం వ్యాపించే పద్ధతులు, నివారణ మార్గాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్యశాఖ అధికారులను విద్యాశాఖ అధికారులతో సమన్వయంగా చేపట్టాలని సూచించింది. విద్యార్థులకు తమ పరిసరాలలో డెంగ్యూ దోమలు పెరిగే ఆవాసాలను గుర్తించడంతో పాటు డెంగ్యూ సోకిన వ్యక్తి లక్షణాలు, ఇతర అంశాలపై ఒక ప్రాజెక్టు వరకుగా విద్యార్థులకు అందించి వారి ద్వారా ప్రజల్లో మరింత చైతన్యం నింపే విధంగా పిల్లల నుంచే పెద్దలకు చైతన్యం అనే విధంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. స్కూల్ హెల్త్ కిట్ పేరుతో ఉపాధ్యాయులకు ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేశారు. అదేవిధంగా గ్రామాలు, మున్సిపాలిటీలు, జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో డ్రైడే కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ ఆర్‌వీకర్ణన్ ఇప్పటికే చర్యలు చేపట్టారు.

పాఠశాల స్థాయిలో కార్యాచరణ..
డెంగ్యూ నివారణ, నియంత్రణ అవగాహన కార్యక్రమం పాఠ్యాంశాల విద్యార్థులకు క్రింది విషయాల పట్ల అవగాహన కల్పించాలి. దోమను హనికరమైన కీటకంగా గుర్తించి దాని నుంచి రక్షించుకొనేందుకు ఉన్న మార్గాలను ఒక్కొక్కటిగా తెలియ చేయాలి. డెంగ్యూ వ్యాధి సోకిన వ్యక్తి గుర్తించి వ్యాధి వ్యాపించకుండా ఉన్న మార్గాలను ప్రజలకు అగాహన చేయాలి. డెంగ్యూ సోకడానికి గల కారణాలను చర్చించాలి. దోమ జీవిత చక్రాన్ని వివరిస్తూ, డెంగ్యూను వ్యాప్తి చేయడంలో దోమ పాత్రను విద్యార్థులకు వివరించాల్సి ఉంటుంది. విద్యార్థులకు డెంగ్యూ లక్షణాల గురించి తెలియజేయడంతో పాటు ఒక వ్యక్తిలో డెంగ్యూ లక్షణాలు కనిపించినైట్లెతే అతను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచనలు చేయాలి. డెంగ్యూ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించడం, నిర్థారిత చికిత్స తీసుకోవడం ఎంత ముఖ్యమో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు.

176
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles