బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ

Wed,November 20, 2019 01:15 AM

-జిల్లాలో నిరాటంకంగా కొనసాగుతున్న ప్రయాణాలు
-దూరప్రాంతాలకూ అందుతున్న ఆర్టీసీ సర్వీసులు
ఖమ్మం కమాన్‌బజార్, నవంబర్ 19: జిల్లాలో ప్రయాణ ప్రాంగణాలు రద్దీగా ఉంటున్నాయి. మంగళవారం 384 వాహనాల్లో సుమారు 72 వేల మంది తమ ప్రయాణాలను కొనసాగించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె మంగళవారం 46వ రోజుకు చేరుకుంది. అయినా ఆ ప్రభావం ఎక్కడా లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఫలితంగా జిల్లా ప్రజలకు తమ ప్రయాణాలను ఆటంకం లేకుండా కొనసాగిస్తున్నారు. ఖమ్మం, సత్తుపల్లి, మధిర డిపోల్లో బస్సులు యాథావిధిగా నడిచాయి. డిపోల్లో తాత్కాలిక డ్రైవర్లను, కండక్టర్ల నియమించుకొని ఆర్టీసీ అధికారులు బస్సులను విజయవంతంగా నడిపారు. అన్ని డిపోల్లోనూ సాధారణ షెడ్యూల్ ప్రకారమే బస్సులు తమ సర్వీసులను అందించాయి. డీఎంలు, డీవీఎంలు ఆయా రూట్ల పనితీరును పర్యవేక్షిస్తూ ప్రయాణికులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా బస్సులను నడిపారు. ఉదయం 5 గంటల నుంచే పల్లెలకూ బస్సులు ప్రయాణం కావడంతో అసలు ఆర్టీసీలో సమ్మె కొనసాగుతోందా? అంటూ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రజరావాణా వ్యవస్థను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ నిత్యం పర్యవేక్షిస్తున్నారు.

అధిక సంఖ్యలో నడిచిన బస్సులు
ఆర్టీసీ ఖమ్మం డివిజన్ పరిధిలోని ఖమ్మం, సత్తుపల్లి, మధిర డిపోల్లో బస్సులను పకడ్బందీ ప్రణాళికలతో దూర ప్రాంతాలకూ బస్సులను నడిపించారు. ఖమ్మం డిపోలో 79 ఆర్టీసీ బస్సులు, 57 అద్దె బస్సులు, మధిర డిపోలో 34 ఆర్టీసీ బస్సులు, 20 అద్దె బస్సులు, సత్తుపల్లి డిపోలో 69 ఆర్టీసీ బస్సులు, 35 అద్దె బస్సులు మంగళవారం నడిచాయి. దాంతో పాటు రవాణా శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ప్రైవేటు బస్సులు 20, మ్యాక్సీక్యాబులు 70 వరకు నడిచాయి. జిల్లాలో మొత్తం 384 బస్సులు, వివిధ వాహనాలు తమ సర్వీసులను అందించాయి. మొత్తం 72 వేల మంది ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేర్చాయి. అన్ని డిపోల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తును నిర్వహించారు. ఖమ్మంలో సీపీ తఫ్సీర్ ఇక్బాల్ ఆదేశాల మేరకు అదనపు డీసీపీ దాసరి మురళీకృష్ణ పర్యవేక్షించారు.

180
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles