ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి..ప్రతి ఒక్కరూ కృషిచేయాలి

Wed,November 20, 2019 01:15 AM

-ప్లాస్టిక్ పెనుభూతాన్ని తరిమికొట్టాలి: వైరా సీఐ, మున్సిపల్ కమిషనర్
-న్యూ లిటిల్‌ఫ్లవర్స్ ఆధ్వర్యంలో విద్యార్థుల భారీ ర్యాలీ, మానవహారం
వైరా, నమస్తే తెలంగాణ, నవంబర్ 19: నేటి ఆధునిక సమాజాన్ని పట్టి పీడిస్తున్న ప్లాస్టిక్‌ను నివారించి ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైరా సీఐ జట్టి వసంతకుమార్, వైరా మున్సిపల్ కమిషనర్ విజయానంద్ పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో భాగంగా వైరాలోని న్యూ లిటిల్‌ఫ్లవర్స్ పాఠశాలలో మంగళవారం విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ పోతినేని భూమేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో సీఐ, కమిషనర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి పెనుముప్పు వాటిల్లుతుందని అన్నారు. ప్లాస్టిక్‌పై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అనంతరం స్థానిక మధిర క్రాస్ రోడ్డులో విద్యార్థులు మానవహారాన్ని ఏర్పాటుచేశారు. అంతేకాకుండా రోడ్ల వెంట ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను విద్యార్థులు ఏరివేశారు. ఎస్సై తాండ్ర నరేష్, లయన్స్ క్లబ్ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కాపా మురళీకృష్ణ, ప్రతినిధులు వనమా విశ్వేశ్వరరావు, నూకల వాసు, వుండ్రు శ్యామ్‌బాబు, ముళ్ళపాటి సీతారాములు, ఏపూరి రాజారావు, గద్వాల రవీందర్, ప్రిన్సిపాల్ షాజీమ్యాథ్యూ, ఏవో సామినేని నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.

202
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles