సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

Tue,July 2, 2019 03:03 AM

ఆసిఫాబాద్ టౌన్: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉం డాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కుమ్రం బాలు, ఇమ్మూ నై జేషన్ అధికారి సీతారాంలు అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని తన కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలోని వైద్య సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభం కావడంతో అంటు వ్యాధులు వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మలేరియా, డయేరియా, చికున్‌గూన్య, డెంగ్యు, మెదడువాపు వ్యాధుల ప్రమాదం పొంచి ఉందనీ, గ్రామాల్లో పరిసరాల శుభ్రతతో పాటు, ప్రజలు వ్య క్తిగత శుభ్రత పాటించేలా అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా 279 గ్రామాల్లో దోమల నివారణ మందు పిచికారీ చేయిస్తున్నామన్నారు. మొదటి విడతలో జైనూర్ మండలంలోని వెం డిగుడ గ్రామంలో ప్రారంభించామన్నారు. 100 శాతం గర్భిణుల నమోదు మొదటి, మూడో నెలలోపే ఖచ్చితంగా నమోదు చేసి ఎంసీపీ కార్డులను అందజేయాలని ఆదేశించారు. ఎన్‌ఎంలు విధిగా ప్రతి బు ధ, శనివారాల్లో టీకాల వేసి వివరాలను నమోదు చేయాలన్నారు. విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో డీవో సుబ్బారాయుడు, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో సుధాకర్‌నాయక్, జిల్లాలోని ఆయా దవాఖానాల్లోని వైద్యాధికారులు, సిబ్బం ది పలువురు పాల్గొన్నారు.

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles