మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధిస్తే చర్యలు

Tue,July 2, 2019 03:04 AM

-అంతర్గత ఫిర్యాదుల కమిటీ కోసం ప్రత్యేక వెబ్‌సైట్
-ఈ నెల 15లోగా నమోదు ప్రక్రియ పూర్తవ్వాలి
-కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు
ఆసిఫాబాద్‌టౌన్: మహిళా ఉద్యోగులను లైం గికంగా వేధిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు అన్నారు. సోమవారం తన కార్యాలయ సమావేశ మందిరంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగుల పై దాడులు, లైంగిక వేధింపులు తదితర అంశాలపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. కలెక్ట ర్ రాజీవ్ గాంధీ హన్మంతు మాట్లాడుతూ ఉద్యో గం చేసే ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపు ల చట్టం 2013 సెక్షన్ 4 ప్రకారం లైంగిక వేధింపుల ఫిర్యాదుల పరిష్కారం కోసం 10 మంది, అంతకు మించి ఉద్యోగులతో కూడిన అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్దేశించిందన్నారు. అంతర్గత ఫిర్యాదుల కమిటీని అన్‌లైన్‌లో నమోదు చేసేందుకు http/tshebox. tgwdcw.in అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించారని చెప్పారు. ఈ నమోదు ప్రక్రియ జులై 15లోగా పూర్తి చేయాలన్నారు. నమోదు చేయని సంస్థలకు రూ. 50 వేల జరిమానా విధించనున్నట్లు పేర్కొ న్నారు. జిల్లా కో ఆర్డినేటర్ శైలజ మాట్లాడుతూ ప్రతి జిల్లా కార్యాలయాల్లో ఇంటర్నల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసుకో వాలని సూచించారు. ఇందులో భాగంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేశామనీ, ఇందులో జిల్లా వ్యవసాయశాఖ అధికారిణి భాగ్యలక్ష్మి చైర్మన్‌గా, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారిణి సావిత్రి కన్వీనర్‌గా, డీసీఆర్వో తిరుమల,ఎక్సైజ్‌శాఖ అధికారిణి రాజ్యలక్ష్మి, లేబర్ అధికారిణి నజర్ ఉన్నిసాబేగం, కాత్యాయణి మెంబర్లుగా వ్యవహరిస్తారన్నారు. ఎలాంటి వేధింపులకు గురైనా ఫిర్యాదుల కమిటీని సంప్రదించాలనీ, వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపా రు. జేసీ రాంబాబు, డీఆర్డీవో వెంకట్ శైలేష్, ఆయా శాఖఅ అధికారులు, మహిళా సిబ్బంది పాల్గొన్నారు.

209
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles