జడ్పీ ఉద్యోగుల విభజన పూర్తి!

Thu,July 4, 2019 03:57 AM

ఆదిలాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఉమ్మడి జిల్లా పరిషత్ కార్యాలయ సిబ్బంది కేటాయింపు కొలిక్కి వచ్చింది. ఉద్యోగుల బదిలీ అంశాన్ని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ చూస్తున్నారు. ఏ జిల్లాకు ఎంతమందిని కేటాయించాలనే విషయం కలెక్టర్‌పై ఆధారపడి ఉంటుంది. ఉద్యోగుల బదిలీల వివరాలతో కూడిన ఫైల్‌ను జడ్పీ అధికారులు కలెక్టర్‌కు అందజేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జడ్పీలో 58 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. మొదటగా ఒక్కో జిల్లాకు విభాగాలవారీగా ఒక్కో ఉద్యోగిని కేటాయిస్తారు. తర్వాత మిగిలిన సిబ్బందిలో డిపార్ట్‌మెంట్‌కు ఒక్కరు లేదా ఇద్దరు మిగిలి ఉంటే ఆదిలాబాద్, నిర్మల్‌కు కేటాయించనున్నారు.

ప్రస్తుతం ఉమ్మడి జిల్లా పరిషత్ కార్యాలయంలో నాలుగు జిల్లాలకు చెందిన ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోనే కొత్తగా ఏర్పాటయ్యే జడ్పీలకు ఆయా జిల్లాలకు చెందిన స్థానిక ఉద్యోగులను బదిలీ చేయనున్నారు. ఇందులో సర్వీసు ఎక్కువగా ఉన్న ఉద్యోగులకు మాత్రమే అవకాశం కల్పిస్తారు. సొంత జిల్లాకు వెళ్లడం లేదా స్థానికంగా ఉండేందుకు వెసులుబాటు కల్పిస్తారు. సర్వీసు తక్కువ ఉన్న ఉద్యోగులను ఏ జిల్లాకు బదిలీ చేసినా వారు అక్కడికే వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆదిలాబాద్ జడ్పీ కార్యాలయంలో ఆదిలాబాద్ జిల్లావాసులు ఎక్కువగా ఉండటంతో వారు ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles