సభ్యత్వానికి విశేష స్పందన

Fri,July 5, 2019 03:47 AM

నార్నూర్ : టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదుకు విశేష స్పందన వస్తున్నదని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. గురువారం మండలంలోని మాన్కాపూర్‌లో కార్యకర్తలు,నాయకులతో కలిసి సభ్యత్వ నమోదు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో లక్ష్యాన్ని మించి నమోదు చేసి జిల్లాలోనే ముందంజలో ఉంచాలన్నారు. ముఖ్య నాయకులు క్రియాశీల సభ్యత్వం తీసుకొని, మిగిలిన వారు సాధారణ సభ్యత్వం నమోదు చేసుకుంటే నే పార్టీ గుర్తిస్తుందన్నారు. అనంతరం కొత్త పాలక వర్గ సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ కనక మోతుబాయి, వైస్ ఎంపీపీ చంద్రశేఖ ర్, కోఆప్షన్ సభ్యుడు షేక్ దస్తగిర్, సర్పంచ్ రాథోడ్ సావిందర్, మాజీ ఎంపీపీ మెస్రం రూప్‌దేవ్, రమేశ్, హైమద్, తొడసం నాగోరావ్, యుర్వేత రూప్‌దేవ్, కనక ప్రభాకర్, మెస్రం మానిక్‌రావ్, కోట్నాక్ నాగోరావ్, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అభివృద్ధిని చూసే చేరికలు..
దహెగాం: అభివృద్ధి చూసే టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారని జడ్పీటీసీ తాళ్లపల్లి శ్రీరామారావు అ న్నారు. గురువారం మండలకేంద్రంలో సభ్య త్వ నమోదు చేపట్టారు. సుమారుగా 1000 మంది సభ్యత్వం తీసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కంభగౌని సులోచన, వైస్ ఎం పీపీ చౌదరి సురేశ్, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు ప్రసాద్‌రాజ్, రైతు సమన్వయ కమిటీ మండల కన్వీనర్ సంతోష్‌గౌడ్, నాయకులు దందెర వెంకన్న, సోను, గజ్జల సురేశ్, పుప్పాల సంతోష్, పాపయ్య, ప్రకాశ్‌గౌడ్, నాగేశ్వర్‌గౌడ్, పుప్పాల శ్రీనివాస్, దామోదర్‌గౌడ్ పాల్గొన్నారు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles