నేడే జడ్పీ పట్టాభిషేకం

Fri,July 5, 2019 03:48 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ/ ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్(జడ్పీ) కార్యాలయంలో శుక్రవారం నూతనంగా ఎన్నికైన జడ్పీ పాలకవర్గం కొలువుదీరనున్నది. స్థానిక ఆర్ అండ్ బీ అతిథి గృహం సమీపంలో నిర్మించిన కొత్త భవనాన్ని ఇందు కోసం సిద్ధం చేశారు. ఇందులో నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీ సభ్యులు పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే అధికారికంగా చైర్ పర్సన్, కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక పూర్తయింది. ప్రమాణ స్వీకారోత్సవానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్యాలయం కొత్త హంగులతో ముస్తాబైంది. ఫర్నిచర్, తదితర సామగ్రి సిద్ధం చేశారు. చైర్ పర్సన్‌గా కోవ లక్ష్మి, కో-ఆప్షన్ సభ్యులు, జడ్పీటీసీలతో కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఉదయం 11.00 గంటలకు ప్రమాణ స్వీకారం ఉంటుంది.

జడ్పీ సీఈఓగా కిషన్
జిల్లాలో శుక్రవారం నుంచి కొలువుదీరనున్న జిల్లా పరిషత్ సీఈఓగా కిషన్‌ను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా పరిషత్‌లకు సీఈఓలను నియమించిన ప్రభుత్వం దీనిలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా పరిషత్ కార్యాలయంలో అకౌంట్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కిషన్‌ను నియమించింది.

ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా పరిషత్ చైర్‌పర్సన్
జిల్లా పరిషత్ పాలకవర్గం శుక్రవారం ప్రమాణాస్వీకరం చేయనున్న నేపథ్యంలో కొత్త భవనంలో ఏర్పాట్లను గురువారం జిల్లా పరిషత్ చైర్మన్ కోవలక్ష్మి పరిశీలించారు. భవనం కొత్తది కావడంతో వేద పండితులతో గురువారం కోవలక్ష్మి వాస్తు పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.

53
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles