ఒరిగిందేమి లేదు..

Sat,July 6, 2019 01:51 AM

కుమ్రం భీం ఆసీఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సంక్షేమ పథ కాలు, అభివృద్ధి కార్యక్రమాలతో దూసుకుపోతున్న తెలంగాణకు కేం ద్ర సహాయం పూర్తిగా కరువవుతోంది. శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ కు ప్రత్యేకంగా ఒరిగిందేమి లేదని మేధావులు అభిప్రాయపడుతు న్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఐదేళ్లవుతున్నా, విభజన చట్టంలోని విషయాలను ప్రస్తావించకుండా సమస్యలను పట్టించు కోవడం లేదు. తెలంగాణలో తాగునీటి సమస్యలను శాశ్వతంగా పరి ష్కరించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి కేంద్రం నిధులు అందజేయాలనీ, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి నిధులను కేటాయించాలని అనేక సార్లు రాష్ట ప్రభు త్వం కేంద్రాన్ని కోరినప్పటికీ, పట్టించుకోకవడం సరికాదని పరిశీలకులు విమర్శిస్తున్నారు. కనీసం వేతనజీవులకు కూడా ఎలాం టి ఊరట కల్పింలేదని మండిపడుతున్నారు. విభజన చట్టంలో కేం ద్రం పరిధిలో ఉన్న సమస్యలను పట్టించుకోకుండా కేవలం పైపై మె రుగులతోనే కేంద్రం నెట్టుకొస్తుందని అంటున్నారు. బంగారం, పెట్రో లు ధరలు పెంచడంతో సామాన్యులపై భారాన్ని మోపుతుందని ఆరో పిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ర్టానికి కేంద్రం ఎ లాంటి ప్రోత్సాహాన్ని ఇవ్వడం లేదన్నారు. విద్య, వైద్యం, సాగునీరు పరంగా ఎలాంటి పథకాలను కేంద్రం ప్రవేశ పెట్ట లేదు. ఆదాయ పన్నులో పేద, మధ్య తరగతి ప్రజలకు ఎలాంటి ఉపశమనం కలి గించలేదని మేధావులు అభిప్రాయపడుతున్నారు.

ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్..
పెంచికల్‌పేట్: పార్లమెంటులో కేం ద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ సామాన్యుల పై భారం మోపేలా ఉంది. పెట్రోల్‌తో పాటు డీజిల్ రేటు విపరీతంగా పెరగ డంతో రవాణా ఖర్చు పెరుగుతుంది. దీంతో నిత్యవసర సరకుల తో పాటు కూరగాయలు ధరలు పెరుగుతాయి. రాష్ర్టానికి న్యాయం చేసే ఎలాంటి ప్రకటన చేయలేదు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడేలా ఎలాంంటి నిర్ణయం లేదు. వేతన జీవులకు కూడా న్యాయం చేయలే దు. సంపన్న వర్గాలకు కొమ్ముకాసేలా బడ్జెట్ ప్రసంగం ఉంది. సరైన బడ్జెట్ ప్రవేశ పెట్టడంలో కేంద్ర ఆర్థిక మంత్రి పూర్తిగా విఫలమ య్యారు. సామాన్యుడు తినే పరిస్థితి లేకుండా చేస్తున్నారు.
-రాచకొండ కృష్ణ

రైతులకు ప్రత్యేకం ఏమీ లేదు..
పెంచికల్‌పేట్:లోక్‌సభలో ప్రవేశ పెట్టి న బడ్జెట్ అంతంత మాత్రమే ఉంది. రై తుల కోసం ప్రత్యేకం ఏమీ లేదు. సామా న్య ప్రజలు బంగారం కొన లేకుండా రేటు పెరిగే అవ కాశం ఉంది. రాష్ర్టానికి బడ్జెట్ అంత ఆశాజనకంగా లేదు. పెట్రో ఉత్పత్తు లు, బంగారంసై సుంకం పెంచడం దా రుణం. పెరిగిన ధరలను తగ్గించాల్సిన కేంద్రం ఇలా చేస్తే సామా న్యుడు బతికే పరిస్థితి ఉండదు. ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చి, ఇప్పుడు ప్రజల నడ్డివిరిచే చర్యలకు కేంద్రం దిగుతున్నది. సామా న్యుడికి న్యాయం చేసే ప్రయత్నం చేస్తే బాగుండేది.
-బబ్బెర శ్రీనివాస్. కొండపెల్లి

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles