ఉపాధ్యక్ష, కార్యదర్శుల ఎన్నికలకు ఉత్తర్వులు జారీ

Sat,July 6, 2019 01:52 AM

ఆసిఫాబాద్ టౌన్: పీసా చట్టం గ్రామసభ ఉపాధ్యక్షులు, కార్యదర్శుల ఎన్నికలకు ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్ రాజీవ్‌గాంది హన్మంత్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చిన పీసా చట్టం ద్వారా గ్రామాల సంపూర్ణ అభివృద్ధికి స్వయం నిర్ణయాధికారం కల్పించబడిందన్నారు. ఈ చట్టం కింద గ్రామసభలను బలోపేతం చేసేందుకు ఉపాధ్యాయులు, కార్యదర్శులను ఎన్నుకునేందుకు జిల్లా పాలనాధికారి జారీ చేసిన134/కే2 పీటీఎస్/2019,04,07,2019 ప్రకారం జిల్లాలోని 13 మండలాల్లో 158 గ్రామపంచాయతీల్లోని 204 గ్రామ సభలు నిర్వహించాలని, 580 అనుబంధ గ్రామాలకు చెందిన గిరిజనులు హాజరయ్యేలా సర్పంచులు, కార్యదర్శులు చూడాలన్నారు. ఎన్నికల నిర్వాహణాధికారులుగా ఆయా మండలాల ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఈవోపీఆర్టీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశామన్నారు. ఈ నెల 9 నుంచి 17 వరకు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పీసా చట్టం కో ఆర్డినేటర్ వసంతరావు ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

88
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles