కళాకారులు నైపుణ్యం పెంపొందించుకోవాలి

Thu,July 11, 2019 01:35 AM

యైటింక్లయిన్ కాలనీ : కళాకారులు నైపుణ్యాన్ని పెం పొందించుకుని ఎంచుకున్న రంగాల్లో రాణించాలని ఆర్జీ-2 జీఎం కల్వల నారాయణ అన్నారు. ఆర్జీ-2 ఏరియాలోని సీఈఆర్ క్లబ్‌లో బుధవారం కళా స్రవంతి పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సింగరేణి యాజమాన్యం కార్మికుల్లో, కార్మిక కుటుంబాల్లో, ప్రభావిత గ్రామాల్లోని యువతీ యువకుల్లో దాగి ఉన్న కళా నైపుణ్యాన్ని వెలికితీయడానికే కళా స్రవంతిని ప్రారంభించినట్లు తెలిపారు. స్థానిక కళాకారుల్లో దాగి ఉన్న కళలను వెలికితీసి మరింత ప్రోత్సహించే లక్ష్యంగా సింగరేణి యాజమాన్యం ముం దుకు సాగుతుందన్నారు. కళా స్రవంతిలో ప్రతిభ చాటిన కళాకారులను ఎంపిక చేసి వారికి, మరింత నైపుణ్యాన్ని పెంపొందించేలా శిక్షణ అందించి సింగరేణి వ్యాప్తంగా జరిగే కళా స్రవంతిలో రాణించేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ అవకాశాన్ని కళాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం కళాకారులు నృత్యాలతో అలరించారు. కార్యక్రమంలో ఎస్‌ఓటు జీఎం సాంబయ్య, అధికార ప్రతినిధి ప్రదీప్‌కుమార్, గుర్తింపు సంఘం నాయకులు బానాకర్, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.

36
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles