బాధిత కుటుంబానికి సింగరేణి అండ

Thu,July 11, 2019 01:35 AM

గోదావరిఖని,నమస్తే తెలంగాణ : సింగరేణి సంస్థ రామగుండం డివిజన్-1 పరిధి జీడీకే-11 గని ప్రమాదంలో మృతి చెందిన కార్మికుడు పులిపాక మల్లయ్య (మాజీ జనరల్ మజ్ధూర్) కుటుంబానికి సింగరేణి యాజమాన్యం అండగా నిలిచింది. సింగరేణిలో చేసుకున్న ఒప్పందం మేరకు మ్యాచింగ్ గ్రాంట్‌గా యాజమాన్యం రూ.10లక్షలతో పాటు సింగరేణి కార్మికుల నుంచి రికవరి చేసిన రూ.10, 09,332లు మొత్తం కలిపి రూ.20,09, 332ల ఫిక్స్‌డ్ డిపాజిట్ చెక్కును పులిపాక మల్లయ్య భార్య సుశీలకు ఆర్జీ-1 జనరల్ మేనేజర్ వీ విజయపాల్‌రెడ్డి బుధవారం అందించారు. ఈ సందర్భంగా జీఎం మా ట్లాడారు. సింగరేణిలో పనిచేస్తూ మృతి చెందిన పులిపాక మల్లయ్య లేని లోటు ఆ కుటుంబానికి తీర్చలేనిదన్నారు. ఆ కుటుంబాన్ని ఆదుకునే ఉద్దేశంతో సింగరేణి యాజమాన్యం మ్యాచింగ్ గ్రాంట్‌గా రూ. 10 లక్షలతో పాటు ఉద్యోగ నియమాక పత్రాన్ని మృతుడి భార్యకు అందించినట్లు తెలిపారు. మల్లయ్య భార్య సుశీల అభ్యర్థన మేరకు ఆమెకు మందమర్రిలో పోస్టింగ్ ఇచ్చినట్లు తెలిపారు. ఇలాంటి సంఘటనలు భవిష్యత్‌లో జరుగకుండా సింగరేణి యాజమాన్యం రక్షణ చర్యలు చేపడుతోందన్నారు. కార్మికులు విధి నిర్వహణలో రక్షణ సూత్రాలు పాటించాలని కోరారు. కార్యక్రమంలో జీడీకే-11 గ్రూపు ఏజెంట్ మనోహర్, గ్రూపు ఇంజనీర్ రామదాసు, మేనేజర్ నెహ్రూ, పర్సనల్ మేనేజర్ ఎస్. రమేశ్, జీఎం కమిటీ సభ్యులు గుమ్మడి లింగయ్య, టీబీజీకేఎస్ పిట్ సెక్రటరీ నాయిని శంకర్, డీవైపీఎంలు సమ్మయ్య, సేఫ్టీ ఆఫీసర్ రమేశ్, వెంటిలేషన్ ఆఫీసర్ జాన్సన్, సంక్షేమాధికారి సారంగపాణి, ఇతర అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.

59
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles