ఫసల్ బీమా..రైతుకు ధీమా

Sun,July 14, 2019 12:58 AM

- పీఎంఎఫ్‌బీవైతో ప్రయోజనాలనేకం
- ప్రతికూల పరిస్థితుల్లో పంటలకు భరోసా
- అతి తక్కువ ప్రీమియంతో వర్తింపు
- సమీపిస్తున్న గడువు

ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ/కాగజ్‌నగర్ రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనతో రైతులకు ధీమా కలగనున్నది. విత్తనాలు వేసింది మొదలు కోతల వరకు.. ఎప్పుడు ఏ విధమైన నష్టం జరిగినా పరిహారం అందుతుంది. అతి తక్కువ ప్రీమియంతో అనేక ప్రయోజనాలు పొందే అవకాశమున్నది. 2019-20 సంవత్సరానికిగాను జిల్లాలో పథకం అమలు చేస్తుండగా, పాలసీ గడువు సమీపిస్తున్నది.

ఆరుగాలం కష్టించి, చెమటోడ్చిన రైతన్న..పంట చేతికి రాకముందే ప్రకృతి ప్రకోపానికి గురైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఏ దశలో ఉన్న పంట అయి నా ప్రకృతి కన్నెర్ర చేసినప్పుడు చిత్తు కాక తప్పదు. అప్పుడు ఆ రైతన్న గుండె చితికే పరిస్థితి ఏర్పడుతుంది. చిన్న నిర్లక్ష్యం కారణంగా భా రీ మూల్యంచెల్లించుకున్న సందర్భాలు అనేకం. ప్రకృతి వైపరీత్యాలతో నష్ట పోయే రైతుల పంటను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) తీసుకువచ్చింది. 2019-20 సంవత్సరానికి జిల్లాలో వ్యవ సాయ బీమా కంపెనీ ద్వారా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా రైతులు అతి తక్కువ ప్రీమియాన్ని చెల్లిస్తారు. పత్తి పంటకు రేపటి( సోమవా రం)తో గడువు ముగియనుండగా, మిగితా పంటలకు ఈ నెలాఖరు వరకు ప్రీమి యం కట్టేందుకు సమయం ఉన్నది.

పథకం లక్ష్యాలు
పంటలకు బీమా ప్రీమియాన్ని కొంతమేరకు రైతులు చెల్లించాల్సి ఉంటుంది. మిగతా సొమ్మును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరిసమానంగా జమ చేస్తాయి. ఈ ప్రీమియం వానకాలానికి 2 శాతంగా నిర్ణయించారు. ఏదైనా కారణంతో పంటకు నష్టం జరిగినప్పుడు బీమా కంపెనీ ప్రతినిధులు, రెవెన్యూ, వ్వ య సాయ శాఖ అధికారులు నూతన సాంకేతిక పరి జ్ఞానంతో పంట నష్టాన్ని అంచనా వేస్తారు. అగ్ని ప్రమాదాలు, గాలివాన, వడగండ్లు, వరదలతో పం టలు నీటమునగడం, తెగుళ్లు, ప్రతికూల వాతావర ణంలో కలుగు దిగుబడి ఆధారంగా నష్టాన్ని గుర్తించి పరిహారం చెల్లిస్తారు.

జిల్లాలో వ్యవసాయం
ప్రకృతి వైపరీత్యాలు, వివిధ కారణాలతో పంటలు దెబ్బతిన్న రైతులకు వా తావరణ ఆధారిత పంటల బీమా పథకం (ఫసల్ భీమా) కింద వర్షాభావ పరిస్థితుల ద్వారా పంటలకు చీడ పీడలు సోకే అవకాశం ఉన్నది. రైతులం దరికీ ఈ భీమా యోజన పథకం ప్రయోజనకరంగా ఉంటుంది. ఖరీఫ్ సీజన్ 2019లో దాదాపుగా జిల్లా రైతాంగం పత్తి సాగు వైపు మొగ్గు చూపుతున్నా రు. జిల్లాలో 1,24,465 వేల హెక్టర్లలో సాగుకు ఆధికారులు అంచనా వేశారు. అందులో పత్తి పంట సుమారుగా 79,903 వేల హెక్టార్లలో సాగుకు అంచనా వేయగా, అంతకంటే ఎక్కవ 90 వేల హెక్టర్లలో సాగయ్యే అవకాశం ఉంది. రెండో స్థానంలో 14,114 లక్ష హెక్టర్లలో కంది సాగు చేస్తున్నారు. దీంతో పాటు వరి 9,494, మొక్కజొన్న 1,656, జోన్న 1924, రాగులు 3 హెక్టార్లు, పెసర 2125 హెక్టార్లు, మినుములు 561 హెక్ట్టార్లు, అలసంత 61 హెక్టార్లు, అనుమలు 6 హెక్టార్లు, మిరుప 48 హెక్టార్లు, పసుపు 13 హెక్టార్లు, చెరు కు 290 హెక్టార్లు, ఇతర ఆహార ధాన్యాలు 1234 హెక్టర్లలో సాగు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వేరుశనగ ఒక హెక్టారు, నువ్వులు 75 హెక్టర్లు, ఆము దాలు 31 హెక్టర్లు, సోయాబీన్ 13364 హెక్టార్లల్లో సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ ఆధికారులు తెలుపుతున్నారు.

బీమా పొందడం ఇలా ..
రైతులు తము వేసిన పంటలకు బీమా చెయించడం చాలా సులభం. బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకున్న రైతులకు ఆయా బ్యాంకులే తప్పనిసరిగా బీమా ప్రీ మియాన్ని వసూలు చేస్తారు. ఇతర రైతులు బీమా చేయించాలంటే ఎంపిక చేసిన పంటలను సాగు చేస్తున్నట్లు వివరాలతో పాటు ప్రీమియం మొత్తం జతపరిచి నిర్ణయించిన తేదీలోగా బ్యాంలు, మీసేవ కేంద్రం, అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధిత పత్రాలను పంపించాలి.

పంట బీమాకు కావాల్సిన ప్రతాలు...
పంట బీమా దరఖాస్తు పత్రం
పంట ధ్రువీకరణ పత్రం
పట్టాదారు పాసుపుస్తకం నకలు
బ్యాంక్ ఖాతా నకలు బీమా ప్రయోజనాలు..
బీమా ద్వారా రైతులు ఆర్థికంగా నష్టం జరుగుకుండా బీమా కంపెనీలు భ రిస్తాయి. బీమా చేసిన రైతుల్లో భరోసా నింపేందుకు ప్రభుత్వాలు బీమా కంపెనీ లతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. అతివృష్టి, అనావృష్టి, గాలి వాన, వడగళ్లు, తెగుళ్లు సోకడం, అగ్ని ప్రమాదం, పిడుగుపాటు తదితర కారణాలతో దిగుబడికి నష్టం జరిగితే పంట కోత ప్రయోగల ద్వారా వచ్చే దిగుబడి ఆధారంగా రైతులకు పరిహారం అందజేస్తారు. ప్రతికూల పరిస్థితులతో రైతుల విత్తనాలు వేయకపోవ డం, వరినాట్లు నాటకపోవడం వలన కలిగే నష్టాలకు బీమా మొత్తంలో 25 శాతం వరకు సత్వర పరిహారంగా చెల్లిస్తారు. పంట మధ్యకాలంలో నష్టపోతే షరతులకు లోబడి అంచ నా వేసి నష్టంలో 25 శాతం ముందుగా రైతులకు చెల్లిస్తారు.

ప్రతి రైతు పంట బీమా చేసుకోవాలి
రైతులు తప్పని సరిగా పంటలకు బీమా చే యించుకోవాలి. ప్రకృతి ప్రకోపం నుంచి పంటలు నష్టపోతే, కొంత నష్ట ఉపశమనానికి వీలుంటుం ది. రైతులు కేవలం 5 శాతం మాత్రమే చెల్లిం చాల్సి ఉంటుంది. మిగితావి కేంద్ర,రాష్ట్ర ప్రభు త్వాలు సమానంగా భరిస్తాయి.
- భాగ్యలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి

50
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles