వానాకాలం వ్యాధుల కాలం అప్రమత్తంగా ఉంటేనే మేలు

Mon,July 15, 2019 01:00 AM

-వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతే కీలకం
-మురుగునీటి నిల్వ అత్యంత ప్రమాదకరం
-ఈగలు, దోమలు వ్యాప్తికి ఇదే సమయం
-అరికడితేనే రోగాలు దూరం
ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ : వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో రోగాల బారిన పడకుండా వ్యక్తిగత, పరిసరాల పరిశుభత్ర పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రధానంగా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం లోపించి దోమలు, ఈగలు వృద్ధి చెంది లేనిపోని వ్యాధులను అంటగట్టే ప్రమాదం పొంచి ఉండగా ముందే అప్రమత్తం కావాలని పేర్కొంటున్నారు. పైగా వాతావరణంలో సంభవించే మార్పుల మూలంగానూ వ్యాధులు వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా దోమ కుట్టడం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే వ్యాధులను కీటక జనిత రోగాలు అంటారు. ఉదాహారణకు మలేరియా ,ఫైలేరియా ,డెంగీ ,మెదడువాపు, స్వైన్‌ ఫ్లూ జ్వరాలు ఉంటాయి. దోమలలో 4 రకాలు ఉంటాయి. ఇవి పలు రోగాల బారిన మనుషులను పడవేస్తాయి. వర్షాకాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తాగునీరు కలుషితమవుతుంటుంది. ఆ నీరు తాగితే వ్యాధులు ప్రబలే ప్రమాదముంటుంది. అపరిశుభ్ర వాతావరణంతోనూ వ్యాధికారక క్రిములు వృద్ధి చెంది రోగాలు వ్యాపిస్తాయి.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles