అనుమతి లేని నిర్మాణాలకు నోటీసులు ఇవ్వండి

Mon,July 15, 2019 01:00 AM

కాగజ్‌నగర్‌ రూరల్‌: అనుమతి లేకుండా కట్టిన ఇండ్లు, లేఅవుట్లకు నోటీసులు అందజేయాలని జిల్లా పంచాయతీ అధికారి గంగాధర్‌గౌడ్‌ అన్నారు. ఆదివారం ఎంపీడీవో కార్యాలయం లో మండలంలోని పంచాయతీ సెక్రటరీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలో ఎన్జీవోస్‌ కాలనీ, బోరిగాం, భట్టుపల్లి, కోసిని, బురదగూడ, నజ్రుల్‌నగర్‌,బోడపల్లి గ్రామాల్లో అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారికి నోటీసులు అందజేయాలన్నారు. గ్రామాల్లో రెండు నెలలకు ఒక సారి సభలను ఏర్పాటు చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. నిరంతరం పారిశుధ్య పనులను చేపట్టాలనీ, 100శాతం పన్ను వసూలు చేయాలన్నా రు. జూలై 31లోగా మండలంలో 100 శాతం మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని సూ చించారు. ఇందుకోసం గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు. డీపీఎం ఆరీఫ్‌, ఈవోపీఆర్డీ రఘు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles