గ్రామాలాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

Mon,July 15, 2019 01:01 AM

ఆసిఫాబాద్‌,నమస్తే తెలంగాణ: గ్రామాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు, ఎంపీపీ మల్లికార్జున్‌ యాదవ్‌ పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని ఈదులావాడ పంచాయతీ పరిధిలోని గొల్లగూడ, కొమ్ముగూడ, సింగరావుపూట, మన్నెగూడ గ్రామాల్లో వారు పర్యటించారు. ప్రజలు నెలకొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో సమస్యల పరిష్కరానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సీసీ రోడ్డు, డ్రైనేజీలు, శ్మశాన వాటికలు ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. గ్రామస్తులు జడ్పీటీసీ, ఎంపీపీలను పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కోఆప్షన్‌ సభ్యుడు అలీబీన్‌ హైమద్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ గంధం శ్రీనివాస్‌, సర్పంచ్‌ బూసి భీమేశ్‌, నాయకులు బాపురావు, తిరుపతి, గోపాల్‌ నాయక్‌, రమేశ్‌, పెంటయ్య, శ్రీనివాస్‌, మధుకర్‌, సురేశ్‌, ప్రసాద్‌ పాల్గొన్నారు.

65
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles