ఇక పచ్చతోరణం

Wed,August 14, 2019 01:51 AM

-నేటి నుంచి జిల్లాలో హరితహారం-5
-ఈ విడతలో 99 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం
-పల్లెల్లో విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు
-నేడు నంబాలలో ప్రారంభించనున్న జడ్పీ చైర్‌పర్సన్ కోవ లక్ష్మి, కలెక్టర్ హన్మంతు
-పాల్గొననున్న ఎమ్మెల్యే ఆత్రం సక్కు,ఎమ్మెల్సీ పురాణం సతీశ్, అధికారులు
జిల్లాలో ఐదో విడత హరితహారం కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రెబ్బెన మండలంలోని నంబాల ఉన్నత పాఠశాలలో బుధవారం జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు మొక్కలు నాటి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ పాల్గొననున్నారు. ఈ విడతలో జిల్లా వ్యాప్తంగా 99 లక్షల మొక్కలు నాటేందుకు అధికార యంత్రాంగం ప్రణాళిక రూపొందించుకోగా, ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామగ్రామాన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు.

కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న హరిత హా రం ఐదో విడత కార్యక్రమాన్ని నేటి నుంచి జిల్లాలో ప్రారంభించనున్నారు. రెబ్బన మండలం నంబాల పంచాయతీ పరిధిలోని ఉన్నత పాఠశాలలో జడ్పీ చైర్‌పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ పురాణం సతీశ్, కలెక్టర్ రాజీవ్ గాంధీ చేతుల మీదుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రా రంభించనున్నారు. జిల్లాలోని గ్రామ గ్రామాన చేపట్టనున్న హారితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు ఇప్పటికే పూర్తిస్థాయిలో చ ర్యలు తీసుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తూ మొక్కలు నాటేందుకు అనుకూలమైన వాతావర ణం ఏర్పడడంతో జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

సర్వం సిద్ధం
ఐదో విడత హరిత హారాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించుకున్నారు. జిల్లాలో 99 లక్షలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజల భాగస్వామ్యం తో గ్రామగ్రామాన మొక్కలు నాటనున్నారు. జిల్లా లో సుమారు 215 నర్సరీల్లో మొక్కలను సిద్ధం చే స్తున్న అధికారులు, బుధవారం నుంచి పూర్తి స్థా యిలో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు. వీ టిలో 35 లక్షలు టేకు, చింత, వేప, మొక్కలు కా గా, మిగిలిన 64 లక్షల మొక్కలు జామ, నారింజ, కరివేప, దానిమ్మ, ఈత, ఖర్జుర, అల్లనేరేడు, వాంటి పండ్ల మొక్కలతోపాటు గులాబి, మల్లె, మందారం, వంటి పూల మొక్కలు ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటి వరకు నాలుగు విడతలుగా హరిత హారం కార్యక్రమాన్ని నిర్వహించింది. 54 శాతం అడవులు విస్తరించి ఉన్న జిల్లాలో హరిత హారంతో మరింత పచ్చదనం పెరుగుతోంది.

ఏర్పాట్లు పూర్తి
జిల్లాలో అటవీ అధికారులు హరిత వనాలను పెద్ద ఎత్తున పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అటవీ ప్రాంతాల్లోని గ్రామాల్లో ప్రత్యేకంగా స్థలాలను ఎంపిక చేసి మొక్కలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నర్సరీల్లో పెంచిన మొక్కలను నాటేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. నాటిన మొక్కలను రెండేళ్ల పాటు సంరక్షించే బాధ్యతలు అటవీ శాఖ తీసుకోనుంది. రైతులకూ అటవీ శాఖ ఆధ్వర్యంలో టేకు మొక్కలను సరఫరాచేసి, ఆదాయ మార్గాలను పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.

32
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles