వ్యాధుల అదుపునకు ప్రత్యేక చర్యలు

Thu,August 15, 2019 01:11 AM

జైనూర్: గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మండల వైద్యాధికారి నాగేంద్ర అన్నారు. బుధవారం మండలంలోని రామునాయక్‌తాండ, నందునాయక్‌తాండ, సొంజిగూడ, సుభాష్‌గూడ గ్రామాల్లో నిర్వహించిన వైద్యశిబిరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ప్రణాళిక బద్దంగా పని చేస్తున్నామని తెలిపారు. ప్రజలు వారి ఇంటి పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో హెచ్‌ఎస్ ల క్ష్మికుమారి, రమేశ్, హెచ్‌ఏ ప్రవీణ్, జలపత్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

25
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles