రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

Thu,August 15, 2019 01:12 AM

జైనూర్: మండలంలోని జంగాం గ్రామానికి చెందిన వ్యక్తికి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... జంగాం గ్రామానికి చెందిన తుమ్ర మహేశ్, కుమ్ర భీంరావ్‌లు ద్విచక్రవాహనంపై జైనూర్ నుంచి జంగాం వెళ్తున్నారు. పోచ్చంలోద్ది గ్రామ సమీపంలో కారుకు సైడ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ అదుపు తప్పి ద్విచక్రవాహనం కిందపడింది. ఈ ప్రమాదంలో కుమ్ర భీంరావ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు భీంరావ్‌ను చికిత్స కోసం ఉట్నూర్ దవాఖానకు తరలించారు.

26
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles