లోకల్ లారీలకే ప్రాధాన్యత

Thu,August 15, 2019 11:42 PM

కాగజ్‌నగర్ టౌన్: లోకల్ లారీ అసోసియేషన్ కే ప్రాధాన్యమిస్తామని సిర్పూర్ పేపర్ మిల్లు (ఎస్పీఎం) యాజమాన్యం హామీ ఇచ్చింది. కొద్ది రోజులుగా కాగజ్‌నగర్ లారీ అసోసియేషన్, మిల్లు యాజమాన్యానికి జరుగుతున్న చర్చలు గురువారం సఫలీకృతమయ్యాయి. ఎస్పీయం కా ర్యాలయంలో లారీ అసోసియేషన్ సభ్యులతో ఎస్పీఎం యాజమాన్యం ని ర్వహించిన చర్చల్లో ఎమ్మెల్యే కోనేరు కోనేరు కోనప్ప, డీఎస్పీ వైవీఎస్ సుదీంధ్ర పాల్గొన్నా రు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇతర ప్రాంతాల లారీలకు కాకుండా లోకల్ వారికే సరుకు ఎ గుమతి, దిగుమతి విషయంలో ప్రాధాన్యత కల్పిస్తే వారికి ఉపాధి దొరుకుతుందని యాజమాన్యానికి వివరించగా యాజమాన్యం భరో సా ఇచ్చింది. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కృషి తో చర్చలు సఫలం కావడంతో లారీ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. మిల్లు ప్రతినిధులు అలోక్ శ్రీవాస్తవ్, అనీల్ దీక్షిత్, కలీం, లారీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

20
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles