ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

Thu,August 15, 2019 11:42 PM

వాంకిడి: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ఎస్టీవో శివ్‌రాజ్ అన్నారు. హరితహారంలో భాగంగా ఎస్టీవో కార్యాలయం ఆవరణలో సిబ్బందితో కలసి మొక్కలు నాటారు. ఎస్టీవో సిబ్బంది పాషా, నాయకులు టేమాజీ, తదితరులు పాల్గొన్నారు.

కెరమెరి: భూప్రపంచంలో చెట్లతోనే సమస్త జీవరాసులకు రక్షణగా మారుతుందని అన్నారు. గురువారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురష్కరించుకుని ధనోర సర్పంచ్ చిలుక కేశవరావ్ జీపీ ఆవరణలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. ఉప సర్పంచ్ సయ్యద్ రిజ్వాన్, ఆదర్శ రైతు మండల కోఆర్డినేటర్ కేంద్రె బాలాజీ, తదితరులు ఉన్నారు.

17
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles